అలుపెరుగని యువ నాయకుడు కేటీఆర్

 

ఎమ్మెల్యే వీఎం అబ్రహం
జోగుళాంబ గద్వాల, జూలై 24, (globelmedianews.com)
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా లోని తెరాస పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ 43 వ జన్మదిన  వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హజరయ్యారు.  ఈ సందర్భంగా కేకులు కట్చేసి కార్యకర్తలకు ఆయా గ్రామాల ఎంపీటీసీలకు సర్పంచ్లకు మండల జెడ్పిటిసిలకు ఎమ్మెల్యే స్వయంగా కేకు తినిపించి కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు, అనంతరం విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అలుపెరుగని పోరాట యోధుడు. 
 అలుపెరుగని యువ నాయకుడు కేటీఆర్ 

చిరకాలం ప్రజల  ఆకాంక్షలను నెరవేర్చే యువకిశోరం కల్వకుంట్ల తారక రామారావు అని కొనియాడారు, ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని మరోవైపు పార్టీ బలోపేతం చేయుటకు ఆయన వంతు కృషిగా ఇప్పటివరకు 70 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత కూడా కేటీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు,  ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు,  ఈ కార్యక్రమంలో ఉండవెల్లి టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి ఎంపిపి బిసమ్మా, వైస్ ఎంపిపి దేవన్న, ఉండవెల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  లోకేశ్వర్రెడ్డి, మానవపాడు సర్పంచ్   హేమా దామోదరరెడ్డి, వడ్డెపల్లి జడ్పిటిసి  రాజు, ఉండవెల్లి సర్పంచ్ రేఖా  వెంకట్ గౌడ్, నార్టీ నేతలు పల్లెపాడు శంకర్ రెడ్డి, తనగల సీతారామిరెడ్డి, మానోపాడు గొల్ల వెంకట్రాములు, డాక్టర్ రమణ, మాజీ ఎంపిపి సుదర్శన్ గౌడ్ ,మాజీ జోగులాంబ చైర్మన్ నారాయణరెడ్డి, వెంకటరామ శెట్టి,  యువ నాయకులు కిషోర్ సురేష్, గోపల్దిన్నె రవి,    భట్ల దీన్ని సురేష్,  బోరవెల్లి వెంకటేశ్, ఇతరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Write comments