భాగ్యనగర్ లో రియల్ బూమ్

 

హైద్రాబాద్, ఆగస్టు 13, (globelmedianews.com - Swamy Naidu)
హైదరాబాద్‌‌లో ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ఎలా ఉందంటే దేశంలోనే భారీ స్థాయిలో పెరిగిన నగరాల్లో భాగ్యనగరం టాప్ ప్లేస్‌‌లో నిలిచింది. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కొనే పరిస్థితి దాటి పోయింది. గత ఆరు నెలల్లోనే హైదరాబాద్‌‌లో ఇళ్ల రేట్లు 9 శాతం పెరిగిపోయాయి. ముంబై, పూణే, చెన్నై నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు 3 నుంచి 4 శాతం తగ్గగా… హైదరాబాద్‌‌లో మాత్రం 9 శాతం పెరిగాయి. 2019 తొలి ఆరు నెలల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్ 47శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 5 వేల 430 కొత్త ఫ్లాట్స్, విల్లాలు అందుబాటులోకి వచ్చాయి.సిటీ రియల్‌‌ ఎస్టేట్‌‌లో హాట్‌‌ ఏరియాగా చెప్పుకునే,  వెస్ట్రన్ సిటీలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట, నానక్ రామ్ గూడ లాంటి ఏరియాల్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 
 భాగ్యనగర్ లో రియల్ బూమ్

ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌లో అంతా కమర్షియల్ స్పేస్‌‌కి ఎక్కువ డిమాండ్ ఉండటంతో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కూడా ధరలు పెరిగిపోయాయి.  మెట్రో రైల్ వచ్చాక.. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు మంచి డిమాండ్ వచ్చి ఆయా ఏరియాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. వాటిలో ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి.  అవుటర్‌‌ రింగ్‌‌ రోడ్డుకు బయట మరో రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు వస్తుండటం నగర శివార్లలో సైతం రియల్‌‌ ఎస్టేట్‌‌కు ఊతమిస్తోంది. హైదరాబాద్‌‌లో ఐటీ కంపెనీలు పెరిగిపోతున్నాయి. ఎంప్లాయిమెంట్ కూడా జోరుగా ఉంది. దీంతో పాటు దేశంలోనే ది బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ నిలుస్తోంది. బెస్ట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్ఛర్ ఉన్న నగరంతో పాటు ఎమర్జింగ్ సిటీగా ఎదుగుతోంది మన నగరం.నగరంలో ఇళ్ల రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ల్యాండ్ రేట్లు భారీగా పెరగడమే. ప్రభుత్వ విధానాలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మెరుగుకావడంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు ఊపందుకున్నాయి.

No comments:
Write comments