గుంటూరు, ఆగస్టు 14, (globelmedianews.com - )
గుంటూరు జీజీహెచ్‌లో మందుల కొరతగా ఉన్నాయి. ఆస్పత్రిలోని మెడికల్‌ స్టోర్‌ మందుల నిల్వలతో నిండుగా ఉండాల్సివుండగా ఖాళీగా కనిపిస్తోంది. స్టోర్‌లో అనేక ర్యాకులు మందులు లేక వెలవెలబోతున్నాయి. ఒక్క మందు బిళ్లలు, సూది మందులే కాదు.. చివరకు రక్త, కళ్లె, థైరాయిడ్‌ పరీక్షల నిర్వహణకు వినియోగించే 5 సీసీ, 2 సీసీ సిరంజిలు, నీడిళ్లు సైతం లేక తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఆసుపత్రిలో నెలకొంది. ఇంజెక్షన్‌ చేయాలన్నా, ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలన్నా తొలుత సిరంజిలు, నీడిళ్లు ఉన్నాయా అని చూసుకోవాల్సి వస్తోంది. సీజనల్‌ వ్యాధులు విజృంభించి ఎక్కడక్కడ ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతుంటే స్ధానికంగా ఆసుపత్రుల్లో కనీసం బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థులకు మందులు ఇవ్వటానికి అవసరమైన మందుల్లేవని జిల్లా వైద్య వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు బోధనాసుపత్రిలోనే కాదు.. పొరుగనే ఉన్న విజయవాడ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. 

మందుల్లేవు... నాలుగు రోజులకే మందులిస్తున్న డాక్టర్లు
రాజధాని జిల్లాలైన కృష్ణా-గుంటూరులకు గుంటూరులోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌) నుంచి వెళ్తాయి. రోగికి ఉన్న రోగం తీవ్రతను బట్టి కొందరికి నెలకు, మరికొందరికి పక్షం, 20 రోజులకు సరిపడా మందులు ఇచ్చి అవి అయిపోగానే మరోసారి వైద్యపరీక్షలకు రావాలని సూచిస్తారు. కానీ ప్రస్తుతం మందుల కొరత కారణంగా ఏ రోగికి అయినా నాలుగైదు రోజులకు మాత్రమే మందులిచ్చి పంపుతున్నామని, ఉన్న ఔషధాలను చాలా జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవల్సి వస్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయిరోగికి ఉన్న రోగం తీవ్రతను బట్టి కొందరికి నెలకు, మరికొందరికి పక్షం, 20 రోజులకు సరిపడా మందులు ఇచ్చి అవి అయిపోగానే మరోసారి వైద్యపరీక్షలకు రావాలని సూచిస్తారు. కానీ ప్రస్తుతం మందుల కొరత కారణంగా ఏ రోగికి అయినా నాలుగైదు రోజులకు మాత్రమే మందులిచ్చి పంపుతున్నామని, ఉన్న ఔషధాలను చాలా జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవల్సి వస్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయిగుంటూరులోని  సీడీఎస్‌కు ఆయా మందులు కావాలని ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడితే 90 శాతం మందులు లేవని తిరిగి ‘సున్నా’లతో కూడిన జీరో వోచర్‌ పంపుతున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు రోగులు ఆయా మందులను బయట కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక మెడికల్‌ స్టోర్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ, పేదోడి ఆస్పత్రిగా భావించే గుంటూరు జీజీహెచ్‌లోనే ఈ పరిస్థితి నెలకొనటం దారుణం. మారుమూల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో ఉన్నతాధికారులే గుర్తెరగాలి. రోజుకు సగటున 1500 మంది వరకు ఇన్‌ పేషెంట్‌, మరో వెయ్యి మంది దాకా అవుట్‌ పేషెంట్‌ సేవలు పొందే ఆస్పత్రిలోనే మందుల కొరత ఇంతగా వేధిస్తుండటం బాధాకరం. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే కాదు.. అంతకుముందు నుంచి కూడా కోస్తా జిల్లాలు మొత్తానికి ఇది రిఫరల్‌ ఆస్పత్రిగా ఉండేది. దీంతో ఒక్క గుంటూరు జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల నుంచి ఇక్కడకు ఆయా వైద్యసేవలు కోరుతూ ప్రజలు వస్తారు. ఈ దృష్ట్యా ఆస్పత్రికి ఉండే తాకిడి దృష్టిలో పెట్టుకుని దీనికి ఔషధాల నుంచి పరికరాల దాకా ప్రతిదీ రెట్టింపు కేటాయింపులు ఉండాలి. రెట్టింపు సంగతి దేవుడెరుగు కనీసం కేటాయించిన బడ్జెట్‌కు సరిపడా మందులే ఇవ్వటం లేదని ఆసుపత్రి వర్గాలు బావురుమంటున్నాయి.ఆరోగ్యశ్రీ, ఇంకేదైనా అత్యవసర వైద్యం పొందుతున్న వారికి మాత్రం హెచ్‌డీఎస్‌ నిధుల నుంచి డ్రా చేసి లేదనకుండా కొంతవరకు ఔషధాలు అందజేస్తున్నారు. సాధారణ, ఇతరత్రా వ్యాధులతో బాదపడుతూ వచ్చేవారికి మాత్రం రోగిని పరీక్షించి ఫలానా వ్యాధి ఉందని, దానికి ఈ మందులు వాడుకోవాలని చీటీ రాసి ఇస్తున్నారు. ఈ చీటీ తీసుకుని మందుల కౌంటర్‌ వద్దకు వెళితే అందుబాటులో ఉన్నవి ఇచ్చి మిగిలినవి బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రజల జేబుకు చిల్లుపడుతోంది

No comments:
Write comments