15 అడుగులకు చేరిన పోచారం ప్రాజెక్టు నీటిమట్టం

 

కామారెడ్డి ఆగస్టు 7 (globelmedianews.com - Swamy Naidu)
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా లోని నాగిరెడ్డిపేట  మండలం లో గల  పోచారం ప్రాజెక్టు లోనికి లింగంపేట పెద్దవాగు, గుండారం  వాగు ద్వారా  నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరింది.1400 క్యూసెక్కుల నీరు లింగంపేట వాగు ద్వారా ప్రాజెక్ట్ లోనికి వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 
15 అడుగులకు చేరిన పోచారం ప్రాజెక్టు  నీటిమట్టం
ఎట్టకేలకు ప్రాజెక్టు లోనికి నీరు వచ్చి చేరుతుండటంతో ఈ ప్రాంత నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా ఖరీఫ్ వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు లోనికి నీరు వస్తుండడంతో  పర్యాటకులతో కళకళలాడుతుంది.

No comments:
Write comments