పాకిస్తాన్ లో ఆగస్టు 15 బ్లాక్ డే

 

లాహోర్, ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
కశ్మీర్‌పై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకొంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం వేడుక్కుతోంది. ఆర్టికల్ 370 రద్దు తదితర కీలక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో పాక్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ భధ్రతా కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ద్వైపాక్షిక ఒప్పందాలపై పున:సమీక్షించుకోవాలని అనుకొంటోంది. లాహోర్ - ఢిల్లీ బస్సు సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 
 పాకిస్తాన్ లో ఆగస్టు 15 బ్లాక్ డే
వాఘా సరిహద్దును మూసివేయాలని, ఢిల్లీలో ఉన్న భారత హై కమిషనర్‌ను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది. అలాగే భారత రాయబారిని బహిష్కరించింది. ఆగస్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని పాక్ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ అంశంపై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకరావాలని డిసైడ్ అయ్యింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ విషం కక్కుతోంది. మోడీ ప్రభుత్వ నిర్ణయాలను పాక్ వ్యతిరేకిస్తోంది. కశ్మీర్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందంటూ ఇమ్రాన్ సర్కార్ నిప్పులు చెరుగుతోంది. చట్ట వ్యతిరేకమంటూ వాదిస్తోంది. తాజాగా పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

No comments:
Write comments