సాగర్ లో కొనసగుతున్న వరద ప్రవాహం

 

నల్గోండ ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu)
నాగార్జునసాగర్  లో వరద ప్రవాహం కొనసాగుతోంది. 8,80,203 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 7,23,536 క్యూసెక్కుల ఔట్ఫ్లో నమోదవుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 302 టీఎంసీలు ఉంది.మరోవైపు పులిచింతలకూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 

 సాగర్ లో కొనసగుతున్న వరద ప్రవాహం
జలాశయం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 5.49 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 39.69 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులకుగానూ.. ప్రస్తుతం 171 అడుగులు నమోదైంది

No comments:
Write comments