31 నుంచి వెంకయ్య టూర్

 

నెల్లూరు, ఆగస్టు 26  (globelmedianews.com
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. నెల్లూరు, కడప జిల్లాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు వెంకయ్య రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. 
31 నుంచి వెంకయ్య టూర్

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో ఆ పర్యటన రద్దయింది. 24న హెలికాప్టర్‌లో చెన్నై నుంచి నెల్లూరు బయలుదేరిన వెంకయ్య జైట్లీ మరణవార్త తెలియగానే వెనుదిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. ఈ నెల 31న శనివారం వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నెల్లూరులోని తన నివాసానికి వెళ్తారు. ఆ తరువాత వెంకటాచలం చేరుకుని ప్రత్యేక రైలులో చెర్లోపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రైల్వే టన్నెల్‌ను పరిశీలిస్తారు. తిరిగి అదేరోజు రాత్రికి వెంకటాచలం చేరుకుంటారు. స్వర్ణభారతి ట్రస్ట్‌లో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ ఒకటో తేదీన గూడూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని గూడూరు - విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. సాయంత్రం మిత్రులతో సమావేశమవుతారు. రెండో తేదీ స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగే వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటారు. తరువాతి రోజు రేణిగుంట బయలుదేరి వెళ్తారు

No comments:
Write comments