ఆర్టికల్ 370 రద్దు పిటిషనర్ల ఫై సుప్రీంకోర్టు ఆగ్రహం

 

అరగంటపాటు చదివినా వ్యాజ్యం ముఖ్య ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదు: జస్టిస్‌ గొగొయి
న్యూఢిల్లీ ఆగష్టు 16 (globelmedianews.com)
అధికరణ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ దారులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే, జస్టిస్‌ ఎస్ ఏ నజీర్ లు పిటిషన్ పై విచారణ జరిపారు. అరగంటపాటు చదివినా వ్యాజ్యం ముఖ్య ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదన్నారు.ఇదేం పిటిషన్ అని జస్టిస్‌ గోగోయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై మొత్తం 7 పిటిషన్లు దాఖలు కాగా.. అందులో నాలుగింటిలో లోపాలున్నాయన్నారు. 
ఆర్టికల్ 370 రద్దు పిటిషనర్ల ఫై సుప్రీంకోర్టు ఆగ్రహం 

ఏం కోరుకుంటున్నారో స్పష్టత లేకుండా వ్యాజ్యం ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.  దీంతో పిటిషన్‌లో సవరణలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది శర్మ కోరారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ద కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధా బేసిన్‌ వేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే స్పందిస్తూ ల్యాండ్‌లైన్‌ వ్యవస్థ పనిచేస్తోందని, శుక్రవారం ఉదయం కశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో మాట్లాడినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు. దీంతో కేంద్రానికి మరికొంత సమయం ఇద్దామన్న ధర్మాసనం.. దీనిపై మరోసారి విచారిద్దామంటూ వాయిదా వేసింది. 

No comments:
Write comments