మెదక్ లో 50 శాతం పూర్తయిన డబుల్ బెడ్ నిర్మాణాలు వడివడిగా డబుల్ నిర్మాణాలు

 

మెదక్, ఆగస్టు 21, (globelmedianews.com - Swamy  Naidu
మెదక్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల్ల నిర్మాణం ప్రగతి పథంలో కొనసాగుతుంది. జిల్లాకు 5,479 ఇండ్ల్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3,058 ఇండ్ల్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయి. 2417 ఇండ్ల్ల నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నాయి. ఇందులో 90 ఇండ్ల్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామంలో 30 ఇండ్ల్ల్ల నిర్మాణం పూర్తికావచ్చింది. వెల్దుర్తిలో 30 ఇండ్ల్ల్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం బోనాల కొండాపూర్‌లో 30 ఇండ్ల్ల్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. జిల్లా కేంద్రమైన మెదక్‌లో 950 ఇండ్ల్ల మంజూరు కాగా 700 ఇండ్ల్ల్ల నిర్మాణం కొనసాగుతున్నాయి. త్వరలో ఇవి పూర్తి కానున్నాయి. నెల రోజుల్లో మొదటి దశలో మంజూరైన ఇండ్ల్ల నిర్మాణం పూర్తికావచ్చింది. ఇందులో 209 ఇండ్ల్ల్ల నిర్మాణానికి స్లాబ్ వరకు పూర్తైయ్యాయి. 108 ఇండ్లు రూప్ లెవల్‌లో ఉన్నాయి. నార్సింగికి మంజూరైన 60 ఇండ్ల్లకు టెండర్లు పూర్తయ్యాయి. 
మెదక్ లో 50 శాతం పూర్తయిన డబుల్ బెడ్ నిర్మాణాలు వడివడిగా  డబుల్ నిర్మాణాలు
రామాయంపేట పట్టణానికి 350 ఇండ్ల్ల్ల మంజూరు కాగా మొదటి దశలో 100 ఇండ్ల్ల్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పిల్లర్స్ పనుల్లో ఉన్నా యి. నిజాంపేట మండలానికి 160 మంజూరు కాగా వాటిలో చల్మెడ గ్రామానికి 60, కల్వకుంటకు 60, నందిగామకు 40 మంజూరయ్యాయి. కల్వకుంటలో స్లాబ్ లెవల్‌లో పనులు జరుగుతున్నాయి. నందిగామ, చల్మెడలో పనులు పిల్లర్స్ స్థాయిలో ఉన్నాయి. వెల్దుర్తి పట్టణానికి 100 మంజూరు కాగా వీటిలో 21 ఇండ్ల్ల్ల నిర్మాణ పనులు పూర్తి కాగా 16 ఇండ్ల్ల్ల పనులు చివరి దశలో ఉన్నాయి. మరో 20 ఇండ్ల్ల్ల పనులు శ్లాబ్ దశలో ఉండగా 43 ఇండ్ల్ల్ల పనులు పిల్లర్ల దశలో ఉన్నాయి. తూప్రాన్ పట్టణానికి 500 మంజూరు కాగా మండలంలోని మల్కాపూర్‌కు 101, అల్లాపూర్‌కు 20, ఇస్లాంపూర్‌కు 30, గుండ్రెడ్డిపల్లికి 62 ఇండ్ల్ల మంజూరు కాగా వీటి పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు.310 ప్లిట్ బీమ్ లెవల్ నిర్మాణంలో ఉన్నట్లు పీఆర్ ఈఈ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఇదిలా ఉండగా మనోహరాబాద్ మండలానికి మొత్తం 203 ఇండ్ల్ల మంజూరు కాగా కోనాయిపల్లి (పీటీ)కి 24, రామాయిపల్లి, పాలాటలకు 83, మనోహరాబాద్ గ్రామానికి 76, కూచారంకు 20 ఇండ్ల్ల మంజూరు కాగా వాటిలో కోనాయిపల్లి, రామాయిపల్లి, మనోహరాబాద్‌లలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కూచారంలో త్వరలో పను లు ప్రారంభం కానున్నాయి. కోనాయిపల్లిలో 12 ఇండ్ల్ల్ల స్లాబులు పూర్తి కాగా మిగితా వాటికి పనులు జరుగుతున్నాయి. చేగుంట, నార్సింగి మండలాలకు మొత్తం 521 ఇండ్ల్ల్ల మంజూరయ్యాయి. వాటిలో చేగుంట పట్టణానికి 116 మంజూరు కాగా చేగుంటలో ఇప్పటికే 52 ఇండ్ల్లకు స్లాబులు పూర్తయ్యాయి. 56 పనులు సాగుతున్నాయి. మరో 8 ఇండ్ల్లకు పనులు ప్రారంభం కానున్నాయి. జి.కొండాపూర్‌కు మొదటి దశ 30, రెండో దశలో 30 కలిపి మొత్తం 60 మంజూరుకాగా మొదటి దశలో మంజూరైన వాటిలో 27 ఇండ్ల్ల్ల నిర్మాణాలు పూర్తై ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. మరో 3 ఇండ్ల్ల్ల పనులు జరుగుతున్నాయి. రెండో దశలో మంజూరైన 30 ఇండ్ల్ల పనులు ప్రారంభం కానున్నాయి. కాగా రెడ్డిపల్లికి 25, గొల్లపల్లి తండాకు 30, మక్కరాజుపేటకు 25 ఇండ్ల్ల మంజూరు కాగా వీటికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. అనంతసాగర్‌కు 15, చందాయిపేట 20, పోతంషెట్టిపల్లి 10, చిన్న శివునూరుకు 20, రాంపూర్‌కు 20, రుక్మాపూర్‌కు 20, పులిమామిడికి 20, కర్నాల్‌పల్లి 20, చెట్లతిమ్మాయిపల్లికి 20, గొల్లపల్లికి 15, వడియారంకు 25 మంజూరు కాగా పనులు ప్రారంభం కానున్నాయి. 

No comments:
Write comments