90 వేల మంది రైతేలతో క్షీర విప్లవానికి బాటలు

 

కరీంనగర్, ఆగస్టు 29, (globelmedianews.com)
ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో క్షీర విప్లవానికి  బాటలు పడుతున్నాయి. పాల ఉ త్పత్తిదారులకు పాడిగేదెలు అందించాలన్న ప్రభుత్వ ని ర్ణయం ఉమ్మడి జిల్లాలో 90వేల మంది రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు దోహదపడనున్నది. కరీంనగర్‌ డెయిరీ పరిధిలో 70వేల మంది పాడి రైతులు,ములకనూరు సహకార బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న స్వకృషి మహిళ డెయిరీ పరిధిలో మరో 20వేల మంది రైతులు ప్రభుత్వం తీసుకు న్న పాడి గేదెల పంపిణీ నిర్ణయంలో భాగంగా లబ్దిపొందనున్నారు. కరీంనగర్ డెయిరీ పరిధిలో నిత్యం లక్ష లీటర్లు, స్వకృషి డెయిరీ పరిధిలో 65వేల లీటర్ల పాల సేకరణ ప్ర స్తుతం కొనసాగుతున్నది.ఆగస్టు 1న ప్రారంభించి ఆరునెలల కాలవ్యవధిలో పాడి గేదెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్షం నెరవేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో లక్ష 50 వేల లీటర్ల పాల ఉత్పత్తి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా.
90 వేల మంది రైతేలతో క్షీర విప్లవానికి బాటలు

పాల ఉత్పత్తిదారులకు పాడి గేదెలు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయా న్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమఖ్య పై ఉండగా ఇందుకు సంబంధించి నియమించిన కమిటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించడం ఈ ప్రాంత పాడి రైతులకు వరంగా చె ప్పుకోవచ్చు.పథకం అమలుకు సంబంధించి కరీంనగర్, ములకనూరు స్వకృషి డెయిరీలకు పాలు పోసే రైతులు,వారి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాల ను సంబంధిత డెయిరీ యాజమన్యాలు ఇప్పటికే పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు అందజేశాయి. ఈ వివరాలన్నింటిని నమోదు చేసే ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. పథకం అమలు, తీరు తెన్నులపై పాడి రైతులకు అ వగాహన కల్పించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 20 వరకు ఉన్న మిల్క్ చిల్లింగ్, బల్క్ కూలింగ్ కేంద్రా ల వారిగా సమావేశాలు నిర్వహించేందుకు కరీంనగర్ డెయిరీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాడి రైతులకు అందించే గేదెలకు రూ. 80 వేలు, రవాణ ఖర్చులకు అదనంగా రూ. 5 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్దిదారుల్లో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ,ఇతరులకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లబ్దిదారులు తమ వంతు వాటా మొత్తం చెల్లించిన వెంటనే పాడి గేదెల కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుండి ఉత్తర్వులు వెలువడుతాయి. ఈ పథకంలో లబ్ధిపొందే రైతులు పశుసంవర్ధక శాఖ అధికారులు, డెయిరీల సిబ్బందితో ప్రమేయం లేకుండానే నేరుగా ఏ ప్రాంతం నుండైనా త మకు నచ్చిన గేదెలను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ఉంది. రైతులు కొనుగోలు చేసిన గేదెలకు మూడు సంవత్సరాల పాటు బీమా సౌకర్యం వర్తిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన పాడి గేదెలు రెండు, మూడు లీటర్లకు మించి పాలు ఇచ్చే అవకాశం లేనందున అత్యధిక లీటర్ల పాలు ఇచ్చే ఇతర రాష్ట్రాల గేదెల కొ నుగోలు పైనే రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నా రు. అందు కోసం ఎనిమిది రాష్ట్రాలలో పాడి గేదెల లభ్యత, ధర తదితర వివరాలను అధికారుల బృందం పర్యవేక్షిస్తున్నది.పథకం ప్రారంభంలో 15 వేల యూ నిట్ల గేదెలను అందజేయాలని ఈ పథకం అమలు కమిటీ భావించినా ముఖ్యమంత్రి ససేమిరా అన్నట్లు సమాచారం.రాష్ట్రంలో డెయిరీల పరిధిలోకి వచ్చే పాడి రైతులందరికి లబ్ది కల్పించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో తమ వంతు వాటాధనం చెల్లించే ప్రతి రైతు ఈ పథకంలో లబ్దిపొందనున్నారు

No comments:
Write comments