జీహెచ్ఎంసీలో ప‌లువురు అధికారుల బ‌దిలీ

 

హైదరాబద్ జూలై 31   (globelmedianews.com - Swamy Naidu
జీహెచ్ఎంసీలో ప‌లువురు అధికారులను బ‌దిలీచేస్తూ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశాలు జారీచేశారు. సికింద్రాబాద్‌ జోన‌ల్ క‌మిష‌న‌ర్ గా ఉన్న .ఎన్‌.ర‌ఘుప్ర‌సాద్ ను గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో డిప్యూటి సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు.
జీహెచ్ఎంసీలో ప‌లువురు అధికారుల బ‌దిలీ
మూసాపేట్ డిప్యూటి క‌మిష‌న‌ర్‌గా ఉన్న వి.మ‌మ‌త‌ను కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ గా బ‌దిలీ.  ప్ర‌స్తుతం కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ గా ఉన్న జె.శంక‌ర‌య్య‌ను త‌దుప‌రి పోస్టింగ్ నిమిత్తం క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం. మూసాపేట్‌లో ఏ.ఎం.సి గా ఉన్న శెర్లీ పుష్యరాగంను చాంద్రాయ‌ణ‌గుట్ట స‌ర్కిల్ డిప్యూటి క‌మిష‌న‌ర్‌గా,  చాంద్రాయ‌ణ‌గుట్ట డిప్యూటి క‌మిష‌న‌ర్ గా ఉన్న పి.మోహ‌న్‌రెడ్డిని మూసాపేట్ డిప్యూటి క‌మిష‌న‌ర్ గా బ‌దిలీ చేసారు.

No comments:
Write comments