కమలం గూటికి రాములమ్మ..?

 

హైద్రాబాద్, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
తెలంగాణ రాజకీయాల్లోనే కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూంరగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి పార్టీ మారుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నేతల తీరుతో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఆమెకు విసుగొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 కమలం గూటికి రాములమ్మ..?
గతంలో విజయశాంతి బీజేపీలో కూడా పనిచేశారు. దీంతో అప్పట్నుంచి ఇప్పటివరకు బీజేపీలోని కేంద్ర నేతలతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆమె వాటిని అలానే కొనసాగిస్తున్నారని అనుచరులు అంటున్నారు.ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో న్న విజయశాంతి అది పూర్తవ్వగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను సైతం ఆమె కలవనున్నారని సమాచారం. మరోవైపు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న అమిత్ షా నిర్ణయంతో బీజేపీ జాతీయ నాయకులు సైతం రెండు సార్లు ఆమెతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు గుప్పుమన్నాయి. రెండు మూడు మాసాల్లో విజయశాంతి రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీలో చేరే విషయమై ఇప్పటివరకు తన అభిమానులతో విజయశాంతి ఇంకా చర్చించలేదని, చర్చించిన తర్వాత ఆమె బీజేపీలోకి వెళ్లాలా ? లేక కాంగ్రెస్‌లో కొనసాగాలా అన్న నిర్ణయం తీసుకోనుందంటున్నారు.

No comments:
Write comments