అశ్రునయనాల మద్య సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు

 

న్యూఢిల్లీ ఆగష్టు 7 (globelmedianews.com - Swamy Naidu)
భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మద్య ముగిశాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన సుష్మా స్వరాజ్‌ పార్థివ దేహాన్ని తొలుత ఆమె నివాసానికి తరలించారు. అనంతరం బుధవారం ఉదయం కార్యకర్తలు, నేతల సందర్శనార్థం భాజపా కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. 
 అశ్రునయనాల మద్య సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు
అనంతరం అభిమానులు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య దిల్లీ వీధుల్లో సుష్మా స్వరాజ్‌ అంతిమ యాత్ర కొనసాగింది. అనంతరం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సుష్మాస్వరాజ్‌ అంతిమ సంస్కారాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, నితిన్‌ గడ్కరీ, జి.కిషన్ రెడ్డి,కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అశోక్‌ గహ్లోత్‌, గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌, పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

No comments:
Write comments