ఆశలకు కత్తెర (శ్రీకాకుళం)

 

శ్రీకాకుళం, ఆగస్టు 21 (globelmedianews.com - Swamy Naidu): పంటలపై కత్తెర పురుగు పంజా విసురుతోంది మొలక దశలోనే ఉద్ధృత స్థాయిలో దాడి చేస్తోంది ప్రతి వారం నివారణ మందుల రూపంలో రైతులకు ఊహించని ఖర్చు తప్పటం లేదు!! మందు ప్రభావం తగ్గిన వెంటనే మళ్లీ విజృంభిస్తోంది!! ప్రభుత్వం ఉచితంగా మందులు అందించకుంటే కర్షకులకు పెట్టుబడులు కూడా రావనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మొక్కజొన్న పంటను కత్తెర పురుగు కబళిస్తోంది. వచ్చిన మొలకలను వచ్చినట్లే తినేస్తూ నాశనం చేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక్కో మొక్కలో పదుల సంఖ్యలో పురుగులు వ్యాప్తి చెంది నామ రూపాల్లేకుండా చేస్తున్నాయి. ఏం చేయలో దిక్కుతోచని రైతులు పంటను కోల్పోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. దీంతో రూ.వేలల్లో నష్టం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. పంట వేసి 50 రోజులయింది. 
ఆశలకు కత్తెర (శ్రీకాకుళం)
పంటను పట్టిన పురుగు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసినప్పటి నుంచి ప్రతి వారానికి ఒకసారి నివారణ మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. సాగు చేయడానికి సాధారణంగా ఎకరానికి రూ.15 వేల వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో అది కాస్త రూ.25 వేల వరకూ చేరుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సుమారు తొమ్మిది వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుత ఏడాది దిగుబడులు తగ్గే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 13 మండలాల్లో మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. అత్యధికంగా లావేరు, రణస్థలం, జి.సిగడాం, పొందూరు, రాజాం మండలాల్లో సాగు చేస్తున్నారు. వీటితో పాటు సంతకవిటి, ఎచ్చెర్ల, వంగర, రేగిడి ఆమదాలవలస, వీరఘట్టం, కొత్తూరు, భామిని, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లో కుడా సాగు ఉంది. ఇటీవలి వానలు కొన్ని ప్రాంతాల్లో రైతులకు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే అనుకున్న స్థాయిలో మిగిలిన చోట వర్షాలు కురవకపోవడంతో పంటకు పట్టిన పురుగులు వదలడం లేదు. ప్రతి ఏడాది రైతులకు రాయితీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసేది. ప్రస్తుత ఖరీఫ్‌లో రాయితీ విత్తనాలు, పురుగు మందుల సరఫరా నిలుపుదల చేశారు. ఫలితంగా ఆ మేరకు రైతులకు ఖర్చు తప్పటం లేదు. మొక్కజొన్న విత్తనాలను కిలో రూ.100 రాయితీతో రైతులకు గత ఏడాది సరఫరా చేశారు. కత్తెర పురుగు మందును కుడా రాయితీపై ఎకరాకు సరిపడా రూ.150కే అందించారు. ఈ పురుగు మందు మార్కెట్‌లో ఎకరాకు సరిగా కొనాలంటే రూ.800 నుంచి రూ.వెయ్యి ఖర్చవుతుంది. ఎకరాకు మూడు సార్లు పిచికారీ చేయాలి. దీంతో ఈ తరహా ఖర్చులే ఎక్కువైపోతున్నాయి

No comments:
Write comments