కన్నుల పండుగగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

 

వనపర్తి ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగె పండుగ తేవయ్యంటూ శ్రీకృష్ణుని గా ముస్తాబు చేసిన వారి తల్లులు వారిని చూసి మురిసిపోయారు.  శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకల ను గ్రామ మహిళలు కన్నుల పండుగ జరుపుకున్నారు. 
 కన్నుల పండుగగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
ఈ సందర్భంగా వారి చిన్నారులను శ్రీకృష్ణుని గా ముస్తాబు చేసి తనివితీరా చూసుకుని హృదయానికి హత్తుకొని పరవశించి పోయారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా గోపాల్ పేట లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీ వేంకట దత్త నిలయంలో శ్రీమతి స్రవంతి ఆమె కుమారుడైన శ్రీ సాయి ఆర్యను శ్రీకృష్ణుని వలె ముస్తాబు చేసి  శ్రీకృష్ణ జయంతి ని వైభవంగా జరుపుకున్నారు.

No comments:
Write comments