రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్

 

హైదరాబాద్, ఆగష్టు 23 (globelmedianews.com)
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అయన పాల్గోన్నారు.  కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ 150 జయంతి వేడుకలు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తలపెట్టారు ప్రధాని. 
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్

ప్రధాని పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలు గా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం వలన దేశ వ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్ల ను నిర్మించారు. ఇంకా మరుగుదొడ్లు లేని వారు ఉంటే మీరు కోరుకున్న స్థలాల్లో ప్రభుత్వం కట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. నగరంలో  జీహెచ్ఎంసీ  నిర్దేశించిన స్థలంలో చెత్త ను వెయ్యాలి. రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలని అన్నారు. స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశం ఒక మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలువురుకి అయన మొక్కలు పంపిణీ చేసారు. 

No comments:
Write comments