ఫిట్ ఇండియా ర్యాలీ

 

విజయవాడ ఆగస్టు 29, (globelmedianews.com)
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహనా ర్యాలీ  నిర్వహించారు. ఫిట్ ఇండియా పేరుతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలోపోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ మాధవీలత, డిసిపి  విజయరావు, మున్సిపల్ కమిషనర్  వెంకటేష్ ప్రసన్న, సీనియర్ ఐ.ఎ.యస్ బాబు.ఎ ఇతరులు పాల్గోన్నారు. 
ఫిట్ ఇండియా ర్యాలీ

కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ర్యాలీ నిర్వహించాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలో నాలుగు ప్రాంతాల నుంచి తుమ్మలపల్లి వరకు ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రోత్సహకాలను అందిస్తుంది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి మరింత అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేస్తామని అన్నారు.  సిపి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండేలా వ్యాయామం, నడక ను అలవాటు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మా పోలీస్  సిబ్బంది కూడా భాగస్వాములు కాబడం అనందంగా ఉందని అన్నారు.

No comments:
Write comments