గ్రామాల్లో నూ...సీసీ కెమెరాలు

 

నల్గొండ, ఆగస్టు 12, (globelmedianews.com - Swamy Naidu)
సీసీ కెమెరా.. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన పదం.. పెద్దపెద్ద షాపుల్లో మాత్రమే కనిపించే సీసీ కెమెరాలు.. నేడు పోలీసుల కృషితో గ్రామాల్లో సైతం ఏర్పాటు చేస్తుండటంతో ఎన్నో సత్ఫలితాలు కలుగుతున్నాయి. గ్రామాల్లో తరుచూ దొంగతనాలు, గొడవలు జరుగుతుండటంతో పోలీసులకు పెద్ద సమస్య గా మారుతున్నాయి.గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, పాఠశాలలు, గ్రామ పం చాయతీ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి కమాండ్ ఆండ్ కంట్రోలింగ్ వ్యవస్థను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేశారు. గ్రామ సేవకులు నిత్యం గ్రామంలో ఏం జరుగుతుందో టీవీ లో చూస్తూ పర్యవేక్షిస్తున్నారు. అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారం ఇస్తున్నారు.
గ్రామాల్లో నూ...సీసీ కెమెరాలు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఆయా గ్రామాల్లో అల్లరులు, గొడవలు, మందుబాబుల చేష్టలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నిఘా నీడలో గ్రామాలుంటాయని భావించిన తొగుట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య వర్గాల సాయంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని తొగుటలో 13, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 6, వెంకట్‌రావుపేటలో 10, మర్పడగలో 4, చందాపూర్‌లో 11, ఘనపూర్‌లో 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోవర్ధనగిరిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏం చేద్దామన్నా.. సీసీ కెమెరాల్లో క్షణాల్లో పోలీసులకు చేరుతుందని భయపడుతున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలన్నింటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ రంగకృష్ణ ప్రయత్నాలు చేయగా, అదే స్ఫూర్తితో ప్రస్తుత ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి పని చేస్తున్నారు. ఇప్పటికే తొగుట, ఏటిగడ్డ కిష్టాపూర్, వెంకట్‌రావుపేట, మర్పడగ, చందాపూర్, ఘనపూర్ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, లింగాపూర్, తుక్కాపూర్, లింగంపేట, బండారుపల్లి మెట్టు, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పట్టణాలకు దీటుగా నిఘా వ్యవస్థలో గ్రామాలు సైతం పోటీ పడే స్థాయికి వచ్చాయి.

No comments:
Write comments