ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు

 

జగిత్యాల  ఆగస్టు 09 (globelmedianews.com - Swamy Naidu):
జగిత్యాల పట్టణంలో శ్రావణ శుక్రవారం వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాలను అరటి ఆకులు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు
పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పట్టణంలోని మార్కండేయ దేవాలయం, వెంకటేశ్వర స్వామి, దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయంలో మహి ళలు ప్రత్యేక పూజలు చేశారు.

No comments:
Write comments