మెగా అభిమానుల సేవ కార్యక్రమాలు

 

గోనెగండ్ల ఆగష్టు 19  (globelmedianews.com - Swamy Naidu)
ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన గోనెగండ్ల మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల(బస్టాండ్ స్కూల్) కు1000 లీటర్ల నీటి ట్యాంకు ను మెగా ఫ్యాన్స్ సేవ సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్,మండల అధ్యక్షుడు గోరంట్ల నాయుడు,మాలిక్ ఆధ్వర్యంలో మండల విద్యా అధికారి వినోద్ కుమార్ ప్రధానోపాధ్యాయులు శాంతిరాజు కు అందించారు, విద్య అధికారి వినోదకుమార్ మెగా అభిమానులపై ప్రశంశల వర్షం కురిపించారు,ఫాన్స్ అనే పదానికి అర్థం, పరమార్థం,అభిమానులే అని అందుకే పుట్టినరోజు, సినిమా రిలీజ్ సమయాల్లో ఆర్భాటలకు వెళ్లి నిధులు వృధా చేయకుండా చిరంజీవి అభిమానులు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం హర్షణీయమని అన్నారు,త్రాగునీరు ఉన్న  పాత నీటి ట్యాంక్ విరిగి పోవడంతో ఇబ్బందికరంగా ఉండేదని,ఇలాంటి మంచి సేవ కార్యక్రమాన్ని చేయడం వలన పాఠశాల విద్యార్థులకు,ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
 మెగా అభిమానుల సేవ కార్యక్రమాలు
అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ అభిమానులే నా కుటుంబం, నా శక్తీ అని మెగాస్టార్ చాలా సందర్భాలలో చెప్పారని, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అభిమానులకు ఆదర్శంగా ఉంటున్న మా హీరో  సినీ జీవితం, ఆరోగ్యం, బాగుండాలని కోరుకుంటూ,సామాజిక సేవలో భాగంగా మా వంతుగా సాయం కోరిన వారికి ఆసరాగా ఉంటూ సేవ సామ్రాజ్యాన్ని విస్తరించుటకు ప్రతి అభిమాని యజ్ఞం లా కదలి ముందుకు రావాలని కోరారు,ఈ 1000 లీటర్ల నీటి ట్యాంక్ పంపిణీలో ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది అన్నారు, కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ మండల కార్యదర్శి యుగంధర్, హరి, చిరంజీవి,సుబాన్, పవన్, మల్లి, ముస్తాఫ్ చాంద్,ఉపాధ్యాయులు,రామన్,గంజలయ్య,లలిత, హుస్సేన్ రెడ్డి, పాల్గొన్నారు

No comments:
Write comments