ఎన్ఎంసీ పట్ల అపోహలు వద్దు

 

విజయవాడ  ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
గత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ ప్రజల్ని ఓట్లు కోసం వాడుకున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి ఆర్టికల్ 370 బిల్లు కి  చాలా పార్టీలు సహకారం అందించాయని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. లిఖిత పూర్వకంగా రామయ్యపట్నం లో పోర్టు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంను కోరితే పోర్టు పనులు ప్రారంభం అవుతాయి. చంద్రబాబు తప్పు ఎక్కడ చేసాను.. ప్రజలకి ఎలా చేరువ అవ్వాలో ఆలోచించాలి తప్ప చాలా కష్టపడ్డా  అంటూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదు. 
 ఎన్ఎంసీ పట్ల అపోహలు వద్దు
కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు మాదిరిగానే ఉంటున్నాయిని అయన అన్నారు. గతం లో సాధ్యం కావు అని చెప్పిన అంశాలనే జగన్ ప్రభుత్వం మళ్ళీ అడగటం విడ్డురం. చంద్రబాబు కి సాధ్యం కావు అని చెప్పిన అంశాలే జగన్ కి కూడా వర్తిస్తాయి. ఎన్ఎంసీ  బిల్లు విషయంలో అపోహలు వద్దు. బిల్లు విషయం లో అనుమానాలు ఉంటే  చర్చలు ద్వారా నివృత్తి  చేసుకోవచ్చు. యాజమాన్యాలకు వత్తాసు పలికేలా  బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు. వైసీపీ ప్రభుత్వానికి కనీసం 6 నెలలు సమయం ఇచ్చి ప్రభుత్వ పని తీరు పై స్పందిస్తామని అయన అన్నారు.

No comments:
Write comments