హరితహారంలో ప్రజలు పాల్గోనాలి

 

శంషాబాద్, ఆగస్టు 7 (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని ధర్మ సాయి,సుల్తాన్ పల్లి గ్రామాల్లో హరితహారం కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గోన్నారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ ధర్మ సాయి మందిరం వద్ద మొక్కలు నాటామని, సుల్తాన్ పల్లి గ్రామంలో ఈత చెట్లు నాటడం జరిగిందని అన్నారు.  
హరితహారంలో ప్రజలు పాల్గోనాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో  ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రోరారు. ,మొక్కలు నాటక పోవడంతో వర్షాలు సరిగ్గా కురవడం లేదని అన్నారు.  తెలంగాణ సీఎం కెసిఆర్ అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి అని అన్నారు,  ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయ్యమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు,సుల్తాన్ పల్లి సర్పంచ్ దండు ఇస్తరి,ఎంపీటీసీ లు,గ్రామ ప్రజలు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.


No comments:
Write comments