అరుణ్ జైట్లీ కన్నుమూత

 

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (globelmedianews.com - Swamy Naidu)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్దన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. డయాబెటిస్ కారణంగా బాగా బరువు పెరిగిపోయిన జైట్లీ 2014లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. 
అరుణ్ జైట్లీ కన్నుమూత
ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. దీంతో బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందిరా గాంధీ పాలన కాలంలో ఎమర్జెన్సీ విధించగా.. విద్యార్థి నేతగా ఉన్న జైట్లీ జైలుకు వెళ్లొచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్‌లో చేరి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయ్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన అరుణ్ జైట్లీ.. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 
1952 డిసెంబర్ 28 జననం
1973లో ఢిల్లీ వర్శిటీ నుంచి లా డిగ్రీ
1974లో ఢిల్లీ వర్శిటీలో విద్యార్ధి సంఘ నాయకుడు
1975ల- ఎమెర్జన్సీ కాలంలో 19 నెలల జైలు
1977 లో ఏబీపీపీ జాతీయకార్యదర్శి
1980లో బీజేపీలో చేరిక
1991 బీజేపీ జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు
1999 సమాచార ప్రసారాల శాఖా మంత్రి
2000 రాజ్యసభకు ఎంపిక
   న్యాయ శాఖా మంత్రి పదవి
2006 రాజ్యసభ కు రెండోసారి ఎన్నిక
2009 రాజ్యసభలో విపక్ష నేత
2012 మూడోసారి రాజ్యసభకు ఎంపిక
2014 ఆర్ధికశాఖ, కార్పొరేట్, రక్షణశాఖ బాధ్యతలు
2018 కిడ్ని ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ
2019 అనారోగ్యంతో ఎన్నికల్లో పోటీకి నిరాకరణ
2019 ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేరిక
2019 ఆగస్టు 24న కన్నుమూత 
భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సోనాలీ
తండ్రి మహారాజ్‌ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది
వాజ్‌పేయి కేబినెట్‌లో సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు
మోడీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు
జైట్లీ హయాంలో నోట్ల రద్దు, జీఎస్టీ అమలు
సాధారణ బడ్జెట్‌లోనే విలీనమైన రైల్వే బడ్జెట్ 
మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ
అమెరికాలోనూ దీర్ఘకాలం చికిత్స  
గత ఏడాది కిడ్నీ మార్పిడి చికిత్స  

No comments:
Write comments