నూజివీడులో నీటికి కటకట

 

నూజివీడు ఆగస్టు 20 (globelmedianews.com - Swamy Naidu):
ఒక  పక్క వరదలతో ఊళ్లకు ఊళ్లు మునిగిపోతుంటే  మరో పక్క తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. . కృష్ణాజిల్లా నూజివీడు పట్టణ పరిధిలో గడచిన ఐదు రోజులుగా మున్సిపల్ తాగు జలాలు సరఫరా కావడంలేదు. దాంతో  సామాన్య ప్రజలు అనేక అవస్థలకు గురి అవుతున్నారు. వివిధ చేతివృత్తుల తో జీవనం కొనసాగించే పేదలు మున్సిపల్ కొళాయి వంక చకోర పక్షుల్లా ఎదురు తెన్నులు చూశారు. మున్సిపల్ కుళాయిలు మొరాయించిన ప్పటికీ, ట్యాంకర్ల ద్వారా నైనా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ఉద్యోగస్తులు, మహిళలు, చిన్నారులు, వయో వృద్ధులు అనేక కష్టాల పాలవుతున్నారు. వర్షాకాలంలో రావలసిన వానలు వెనక్కు తగ్గడంతో ఎండలు మెండుగా ఉన్నాయి. 
నూజివీడులో నీటికి కటకట
దీంతో మే నెల వేసవిని తలపిస్తోంది. సాయంత్రం వరకు కుక్క పోత లో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనికితోడు మున్సిపల్ కొళాయి లలో నీటిని విడుదల చేయకపోవడంతో ప్రజలు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి తక్షణమే తాగు నీటిని విడుదల చేయవలసినదిగా నూజివీడు పట్టణ ప్రజలు మహిళలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

No comments:
Write comments