తగ్గుతున్న కృష్ణా ఉధృతం

 

విజయవాడ, ఆగస్టు 17 (globelmedianews.com)
కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పడుతోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజీవద్ద 8.21 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లోనమోదయింది. మరోవైపు,  వరద నివారణకు అన్ని చర్యలూ అధికారులుతీసుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విధుల్లో 140 మంది ఫైర్ సిబ్బంది వున్నారు. పది  మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండు జిల్లాల్లో 180 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో వున్నారు. 
 తగ్గుతున్న కృష్ణా ఉధృతం

మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికచర్ల, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. గుంటూరుజిల్లాలో 10 మంది ఎస్డీఆర్ఫ్ ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, తుల్లూరు, సీతానగరం మండలాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కృష్ణాజిల్లాలో 41 పునరావాస శిబిరాలు, గుంటూరులో 15 శిబిరాల ఏర్పాటు చేసారు. కృష్ణాజిల్లాలో 32 మెడికల్ క్యాంపులు, గుంటూరులో 22 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసారు. కృష్ణాజిల్లాలో 14, 413 ఆహారపొట్లాలు, 42వేల మంచినీటిప్యాకెట్ల పంపిణీ చేసారు. కృష్ణాజిల్లాలోని 18 మండలాల్లో 34 గ్రామాలపై, గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లోని 53 గ్రామాలపై వరద ప్రభావం బాగా వుంది. మొత్తం 32 మండలాల్లోని 87 గ్రామాలపై వరద ప్రభావం పడింది. 

No comments:
Write comments