ఆశ్వరావుపేట జడ్పీ స్కూలు విద్యార్ధుల అందోళన

 

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 6, (globelmedianews.com - Swamy Naidu)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఖాళీ కంచాలతో నిరసన బాటపట్టారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని నిర్వాహకులు తమఅక్రమార్జన కోసం పథకానికి తూట్లు పొడుస్తున్నారనేది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే తేటతెల్లమవుతుంది. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఉడికిఉడకని పదార్ధాలు పెడుతున్నారని ఇవి తిని అనారోగ్యాల పాలవుతున్నామని విద్యార్ధులు గగ్గోలు పెడుతుననారు.
 ఆశ్వరావుపేట జడ్పీ స్కూలు విద్యార్ధుల అందోళన
నిర్వాహకుల పైచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఇప్పటికీ వారిపై చర్యలు లేవని విద్యార్థుల ఆరోపణ.  ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూలినాలి చేసుకుంటూ ఉంటారని గతంలో ఇంటి వద్ద నుండే భోజనం తెచ్చుకునేవారమని మధ్యాహ్నం స్కూల్లో అన్నంపెడతారు కదా అని భోజనం తెచ్చుకోకుండా వస్తుంటే ఖాళీకడుపులతో పస్తులు ఉండాల్సిన పరిస్థితివస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉపాధ్యాయుల వాదన. ఉన్నతస్థాయిలోమాత్రమేవీరిపై చర్యలు తీసుకునే వీలు ఉంటుందని, నిర్వాహకులపై తమకు ఎటువంటి హక్కు లేనందువలన పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు చేపట్టి నాణ్యమైన ఆహారం అందించకపోతే రోడ్డుపై బైఠాఇస్తామని విద్యార్థులుఆ వేదనతో హెచ్చరిస్తున్నారు.

No comments:
Write comments