దుర్గగుడి ఈవోగా బాద్యతలు చేపట్టిన సురేష్ బాబు

 

 విజయవాడ ఆగస్టు 22, (globelmedianews.com)
దుర్గగుడి ఈవోగా సురేష్ బాబు గురువారం బాద్యతలు చేపట్టారు. ముందుగా అమ్మవారి దర్శన అనంతరం ఈవో చాంబర్ లో అయన  బాద్యతలు చేపట్టారు. సురేష్ బాబు మాట్లాడుతూ నాకున్న అనుభవంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తాను. కో ఆర్డినేషన్ తో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. 
దుర్గగుడి ఈవోగా బాద్యతలు చేపట్టిన సురేష్ బాబు

ఫిర్యాదులు,సలహాలు సూచనలు పుస్తకాన్ని ఏర్పాటు చేస్తాం. దుర్గగుడి రాజధానిలో ఉంది. మంచి పేరు తెప్పించేలా చేయాలి తప్ప చెడ్డపేరు తీసుకురాకూడదు. సిబ్బందిని కలుపుకొని వెళతా. అందరి సహకారం తీసుకుంటానని అన్నారు. నేను కింద స్దాయి నుండి దుర్గగుడిలో పనిచేసి ఈవో స్దాయికి ఎదిగాను. లోటుపాట్లు అన్ని కూడా నాకు తెలుసని అయన వ్యాఖ్యానించారు. 

No comments:
Write comments