లోకేష్ ఫ్యూచర్ ఏమిటో

 

గుంటూరు, ఆగస్టు 27, (globelmedianews.com - Swamy Naidu)
ఆయ‌న యువ‌కుడు. ప‌ట్టుమ‌ని 35 ఏళ్లు కూడా నిండ‌ని న‌వ య‌వ్వనుడు. అందునా ఓ పార్టీ అధినేత‌కు కుమారుడు. రెండున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. మ‌రి ఏ రేంజ్‌లో యువ‌త‌ను ఆక‌ర్షించాలి ? ఏ రేంజ్‌లో రాజ‌కీయాల్లో దూసుకు పోవాలి? ఎలాంటి రాజ‌కీయాలు చేయాలి? కానీ, ఆయ‌న చేస్తున్నారా? ఆయ‌న దూసుకు పోగ‌లుగుతున్నారా? అంటే.. ఇవ‌న్నీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? అనే స‌మాధానానికి ఆన్సర్ మాత్రం నారా లోకేష్‌. ఘ‌న‌త వ‌హించిన అనుభ‌వ‌శాలి, 14న్నరేళ్లు సీఎంగా చ‌క్రం తిప్పిన జాతీయ నాయ‌కుడు నారా చంద్రబాబు ఏకైక కుమారుడు. స్టాన్ ఫార్డ్ యూనివ‌ర్సిటీలో విద్యను అభ్యసించిన నారా లోకేష్ రాజకీయాల్లో మాత్రం ఎదగలేకపోతున్నారు.
లోకేష్ ఫ్యూచర్ ఏమిటో
అయితే, రాజ‌కీయాల్లో ఆయ‌న ఏం చ‌దివాడు.? ఎవ‌రి కొడుకు? అనే వాటిక‌న్నా కూడా ఎంత‌మందిని త‌న వైపు తిప్పుకోగ‌లిగాడు? ఎంత‌బాగా ప్రజ‌ల‌ను ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌గ‌లిగాడు? ఎంత యాక్టివ్‌గా ఉంటాడు? అనే విష‌యాల‌కే ప్రాధాన్యం ఉంటుంద‌నే విష‌యంలో మాత్రం ఆయ‌న వెనుక‌బ‌డిపోయారు. ఆ పార్టీ సీనియ‌ర్ల మాటల్లో చెప్పాలంటే.. ఆయ‌న చేసిన‌వి.. చేస్తున్నవి త‌ప్పు.. ప్రత్యర్థి వైసీపీ నేత‌ల మాట‌ల్లో చెప్పాలంటే.. ఆయ‌నో పెద్ద ప‌ప్పు! ప‌ట్టుమ‌ని ఓ వంద మందిని కూడా త‌న‌వైపు తిప్పుకోలేక‌పోయిన నాయ‌కుడుగా ముద్రవేసుకున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త ఎక్కువ మందే ఉన్నారు. వీరిలో చాలా మంది చూపు రాజ‌కీయాలపై ఉంది. అయినా కూడా వీరిని ఆక‌ర్షించ‌డంలో లోకేష్ విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఏనాడూ ఆయ‌న మాస్‌ను ఆక‌ట్టుకునేలా నాలుగు ప్రాస ప‌దాల‌తో.. మాట్లాడింది లేదు. అస‌లు ఆయ‌న నోరు విప్పక పోవ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎక్కడ నోరు విప్పినా.. ఏవో త‌ప్పులు చేస్తున్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేశారు.అత్యంత కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గం అప్పటి వ‌ర‌కు రాష్ట్రంలో ఎంత‌మందికి తెలు సోలేదో తెలియ‌దు కానీ.. లోకేష్ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేయ‌డంతో ఒక్కసారిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం పేరు మా ర్మోగింది. అయితే, మ‌నోడు చేసిన నిర్వాకంతో మ‌రింత‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల నోళ్లలో నానింది. మంగ‌ళ‌గిరి అనే పేరును ప‌ల‌క‌లేక నానా తిప్పలు ప‌డ్డారు. అదేస‌మ‌యంలో ప్రజ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలోను నారా లోకేష్‌ వెనుక‌బ‌డ్డారు.చంద్రబాబు త‌న‌యుడి హోదాలో భ‌విష్యత్తు టీడీపీ వార‌సుడిగాను… కాబోయే ముఖ్యమంత్రి గాను చంద్రబాబు ప్రొజెక్ట్ చేసిన త‌న వార‌సుడు నారా లోకేష్‌ చివ‌ర‌కు తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయి పొలిటిక‌ల్ ఎంట్రీతోనే ఘోర‌మైన ఓట‌మి మూట‌క‌ట్టుకున్నారు. అటు వైసీపీ నేత‌లు లోకేష్‌ను ప‌ప్పు, ప‌ప్పు మ‌హ‌రాజ్ అంటూ తీవ్రమైన ప‌ద‌జాలంతో విమ‌ర్శిస్తున్నా టీడీపీ నుంచి ఎలాంటి ఘాటైన కౌంట‌ర్ లతో ప్రజ‌ల్లోకి వెళ్లడం లేదు. ఓ యువ‌నేత‌గా ఉంటూ యువ‌త‌కు ఐకాన్‌గా మారుతాడ‌ని భావించిన నారా లోకేష్‌అలా కాక‌పోగా.. యువ‌త‌దూర‌మ‌య్యే ప‌రిస్థితిని తెచ్చుకున్నాడు. సో.. ఇదీ చంద్రబాబు పుత్రుడి స్టోరీ..!

No comments:
Write comments