పక్క దారి పడుతున్న రేషన్ బియ్యం

 

నిజామాబాద్, ఆగస్టు 13, (globelmedianews.com - Swamy Naidu)
రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించడంలో కొందరు వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లబ్ధిదారులు, డీలర్ల వద్ద నుంచి చౌకగా బియ్యం కొనుగోలు చేసి ధర ఎక్కువ ఉన్న ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. పక్క జిల్లాల నుంచి ఇక్కడికి సరకును రప్పించుకొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన రేషన్‌బియ్యం రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల నుంచి తీసుకొచ్చారు. ఇది కాకుండా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన నెల వ్యవధిలో 12 మంది వ్యక్తులు బియ్యం తరలిస్తూ పట్టుబడడం గమనార్హం. రేషన్‌ బియ్యాన్ని కిలోకు రూ. 10-12కు కొనుగోలు చేసి రూ. 20 వరకు మన వద్ద విక్రయిస్తున్నారు. ఈ బియ్యానికి మహారాష్ట్రలో రూ. 25-28 వరకు డిమాండ్‌ ఉంది.
 పక్క దారి పడుతున్న రేషన్ బియ్యం

దీంతో కొందరు దళారులు బియ్యం దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.ఉభయజిల్లాల్లో సుమారు 6.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.72 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండడం గమనార్హం. అయితే ఇందులో సుమారు 10-15 శాతం కుటుంబాలకు రేషన్‌ బియ్యం అవసరం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరు ఆర్థికంగా స్థిరపడిన వారు కావడంతో వీరికి వచ్చిన కోటాను ఇతరుకు విక్రయించుకుంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో రేషన్‌ బియ్యం చెలామణి అవుతోంది. అయితే ఇప్పటికీ కొందరు పేదలకు రేషన్‌కార్డులు లేక బియ్యం పొందడం లేదు. ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలకు చౌకబియ్యం సరఫరా నిలిపివేసి పేదలకు పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. పైగా అక్రమ రవాణాను అరికొట్టొచ్చురేషన్‌ బియ్యం పక్కదారి పట్టించే క్రమంలో వాటని పక్కాగా సేకరించి ఒక చోట డంప్‌ చేస్తున్నారు. ఎవరికి అనుమానం తలెత్తకుండా రెండు మూడు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి ఒక చోట నిల్వచేస్తున్నారు. 50 క్వింటాళ్లు సేకరించగానే విక్రయిస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి బియాన్ని ఇక్కడకు తెప్పించుకున్నారు. కిలోకి రూ. 8కే కొనుగోలు చేసి ఉభయ జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట ప్రత్యేక వాహనాల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. మరికొందరు రైళ్లలోనూ తీసుకెళ్తున్నట్లు సమాచారం.

No comments:
Write comments