ఇటు కల్లు అమ్మకాలు.. అటు బాధ్యతలు

 

కరీంనగర్, ఆగస్టు 29, (globelmedianews.com)
సర్పంచ్ కదా ఎలా కల్లు అమ్మాలి…? ఎవరైన చూస్తే బాగుండదేమో..? ఎవరైన ఎమైన అనుకుంటారేమో…? అనే వాటికి చోటివ్వకుండా ఎవరేమైన అనుకోనివ్వండి ఈ సర్పంచ్ పదవి పోయింతరువాతనైన కల్లు అమ్ముకునే బతకాలి కదా…? పైగా తమకు ఇదే అన్నం పెడుతుంది. ప్రజల సేవకు వారు అవకాశం ఇచ్చారు. వారికి కూడ న్యాయమే చేస్తున్నాము. ఎన్నో పంచాయతిలు పెట్టుకుని తమకు పిలిపిస్తారు. వారికి అయినంతకాడికి న్యాయంగనే మాట్లాడి ఇరువురిని నచ్చ చెప్పి సంసారాలు కూలకుండా చూస్తాం. అని అంటోంది ఈ మహిళ సర్పంచ్. వార్డు మెంబర్లు వచ్చి వీధి లైట్లు, మురికి కాలువలు, పరిశుభ్రత గురించి అడిగితే వారికి కావల్సిన డబ్బులు కార్యదర్శితో ఇప్పించి పనులు కూడ చేయిస్తానంటోంది. ఏ కార్యక్రమాలు లేనప్పుడు మాత్రం దిన చర్యగా కల్లు అమ్ముకుంటామంటోంది. 
ఇటు కల్లు అమ్మకాలు.. అటు బాధ్యతలు

భర్తకు చేదోడు వాదోడుగా తన వంతు సహాయ సహాకారాలు అందించి బతుకు బండిని నెట్టుకురావడంలో తప్పేముందని ఆమె చెబుతోంది. గతంలో తన భర్త వెంకట్ గౌడ్ ఎంపిటిసిగా పదవి చేపట్టిన అనుభవం ఆయనకు ఉంది. యేదైన తెలియని విషయాన్ని ఆయనతో చెప్పి చేయిస్తానంటోంది ఈ మహిళ సర్పంచ్. ప్రతి ఒక్కరు కుల వృత్తిని కాపాడాలని ఆమె ఆకాంక్షిస్తోంది. బేషాజాలకు పోయి బొక్కబోర్ల పడవద్దని కూడ ఆమె హితువు పలికారు. తమ పని తాము చేసుకుంటే తప్పేమి లేదంటున్నారు. అయితే జిపికి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జిపికి నిధులు అవసరమున్నంత రావడం లేదని, ఒక్క 14వ ఆర్థిక ప్రణాళిక నిధులే వస్తున్నాయని, వాటితోనే అన్నీ పనులు చేయడం కష్టంగా మారిందన్నారు. ఇందులో నుంచే 30 శాతం కరెంటు బిల్లు, 30 శాతం ఫిల్టర్ వాటర్, 40 శాతం సపాయిల జీతాలకు సరిపోతుఉందని అన్నారు. మిగత డబ్బులు చిన్న చిన్న పనులకు తాము అప్పులు చేసి బోర్లు, మెకానిక్ చార్జిలు లాంటివన్ని తమే చూసుకోవల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జవహర్ రోజ్‌గార్ నిధులు వచ్చేవి ప్రస్తుతం అవి రాకపోడంతో చాల సమస్యలు వస్తున్నాయన్నారు. కాని ఇటివల మన మండలం రూర్బన్ పథకం కింద ఎంపిక కావడంతో అంతో ఇంతో పనులు చేపడుతున్నామని కూడ ఆమె చెబుతోంది. ప్రభుత్వం గ్రామ పంచాయతిలకు నిధులు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తమకు యేడాదికో, ఆర్నెల్లకో జీతం వస్తుందని, నెల నెల జీతం వస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కుల వృత్తే దైవంగా భావించే వారిలో చాల తక్కువ మంది కనిపిస్తారు. కాల క్రమేణ విదేశీ పోకడలకు పోయి కుల వృత్తులను కనుమరుగు చేసేలా సమాజం తయారైంది. సరే ఇది వేరే విషయం కాకున్నప్పటికి కొందరు కుల వృత్తి ఉన్న దానికి లెక్కచేయని వారు కూడ లేకపోలేదు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, డక్కలి ఇలా చాల వృత్తులు కనుమరుగవుతున్నాయి. కాని జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికల్లో బిసి మహిళ రిజర్వేషన్ రావడంతో అక్కడ మాజి ఎంపిటిసి భార్య అయిన పద్మావతి వెంకట్‌గౌడ్ సర్పంచ్‌గా ఎన్నికైంది. అప్పుడు కూడ భర్త ఎంపిటిసి అని ఎప్పుడు గర్వపడలేదు. ఇప్పుడు కూడ తాను సర్పంచ్‌ను అని గర్వపడటం లేదు. గౌడ కులస్తులైనందున కల్లు అమ్ముకునే జీవనం సాగించాలి. అదే విధంగా ఇంట్లో పనులు ముచించుకున్నాక నేరుగా కల్లు దుకాణంలో వెళ్ళి కల్లు అమ్ముతుంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సర్వ సభ్య సమావేశాలు ఉన్నప్పుడు తప్పకుండా హజరు అవుతుంది. తానుమొత్తానికి ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, అటు ఇంటిపనులతో సహ దుకాణం నడపడంతో ఆమె బిజిగా గడుపుతున్నారు. కుల వృత్తే దైవంగా భావించి సర్పంచ్ అయి ఉండి కూడ కల్లు అమ్మడం కొత్తవారికి ఆలోచింపచేస్తుంది. కాని నేను చేసేది వంద శాతం కరెక్టేనని నమ్ముతానంటోంది ఈ మహిళ సర్పంచ్. ఆమె ఆత్మస్థైర్యానికి జోహర్లు పలుకుదాం. కులవృత్తుల్ని చేపడదాం.

No comments:
Write comments