మోడీకి ప్రజల మద్దతు

 

విశాఖపట్నం ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu )
ఒకే దేశం ఒకే అజెండాతో బీజేపీ ముందుకెళ్తోందని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.విశాఖజిల్లా అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ శక్తివంతం, సమర్థవంతమైన పాలనపై నమ్మకంతో ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
 మోడీకి ప్రజల మద్దతు
దేశాన్ని అభివృద్ధి బాటలో పెట్టేందుకు ప్రధాని మోడీ విశేష కృషి చేస్తున్నారన్నారు.2014 నుంచి పేదరిక నిర్మూలన ,గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టిన అయన తాజాగా  2019 నుంచి చారిత్రాత్మక నిర్ణయాలపై దృష్టి పెట్టారన్నారు.కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చరిత్రాత్మక నిర్ణయమని చరిత్రలో లిఖించదగిన విషయంగా అభివర్ణించారు. స్వచ్ఛమైన రాజ్యాంగ దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కావడం ఆనంద విషయమని దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

No comments:
Write comments