జగన్ అనుకున్నట్టుగానే...అడుగులు

 

న్యూఢిల్లీ, ఆగస్టు 27, (globelmedianews.com - Swamy Naidu)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పోలవరం రీటెండర్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను కేంద్రం సూచనలను కూడా  లైట్ తీసుకోవాలని అనుకుంటున్నారా … అంటే.. అవుననే పరిస్థితులు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కేంద్ర పెద్దలతో భేటీ కోసం.. ఢిల్లీ వెళ్లిన జగన్ ఆయనతో పాటు వెళ్లిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలవరంపై తమ విధానాన్ని.. నేరుగానే చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మణాన్ని  రీటెండర్ల ద్వారానే కొనసాగిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే రీటెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రివర్స్ టెండర్ల విషయంలో అడుగు ముందుకు వేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి ఏపీ సర్కార్ కేవలం విద్యుత్ ప్రాజెక్టు గురించి మాత్రమే  సర్కార్ ఆదేశాలిచ్చిందని వాదిస్తోంది. అయితే.. ఏపీ సర్కార్.. అటు పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులకు.. విద్యుత్ కేంద్రానికి కలిపి రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.
 జగన్ అనుకున్నట్టుగానే...అడుగులు
అంటే రివర్స్ టెండర్లను మొత్తం నిలిపివేసినట్లే అవుతుందని.. న్యాయనిపుణుల అంచనా. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం కూడా రివర్స్ టెండర్ల విషయంలో అసంతృప్తిగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చాలా స్పష్టంగానివేదిక ఇచ్చింది. రివర్స్ టెండర్లకు వెళ్తే అటు ధనం ఇటు సమయం వృధా అవుతుందని తేల్చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ పలువురితో ఈ విషయాలపై మాట్లాడతారని కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి భేటీ జరగకుండానే మంత్రి పెద్దిరెడ్డి..రివర్స్ టెండర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రకటించేశారు. అంటే.. ఏపీ సర్కార్ విధానం ఇదే అనుకోవాలి. హైకోర్టులో డివిజన్ బెంచ్ కు వెళ్లడమే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవడమో.. చేసి..తాము వెనక్కి తగ్గకుండా రివర్స్ ప్రక్రియను స్ట్రెయిట్ గా తీసుకెళ్లాలని… ఏపీ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని అనుకోవచ్చు. పోలవరం రివర్స్ టెండర్ల పై ఇప్పటికే పీపీఏ సీఈఓ జైన్ నుండి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నివేదికను తెప్పించుకొంది.ఈ విషయమై నిర్ణయం తీసుకొనేముందు అమిత్ షా, ప్రధానితో జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చర్చించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల పై 18 పేజీల నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఈ నెల 23వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు నివేదికను ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టు హైడల్, హెడ్ వర్క్స్‌కు సంబంధించి  ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. రివర్స్ టెండర్లపై నవయుగ కాంట్రాక్టు కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.రివర్స్ టెండర్లపై ముందుకు వెళ్లకూడదని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యటన నుండి ఏపీకి తిరిగి వచ్చిన జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రివర్స్ టెండరింగ్ విషయమై న్యాయ నిపుణులతో కూడ ఏపీ సర్కార్ చర్చిస్తున్నట్టు సమాచారం.రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ ఈ నెల 16వ తేదీన ఏపీ ప్రభుత్వానికి కూడ లేఖ రాశారు. ఈ పరిణామాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం జగన్ చర్చించారు.రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యం కానుందని  పీపీఏ వాదిస్తోంది. అయితే రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని జగన్ కేంద్ర మంత్రుల దృస్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.పీపీఏల రద్దు,  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లపై ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు చెప్పిన మీదటే జగన్ నిర్ణయం తీసుకొన్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

No comments:
Write comments