నయీం బాధితులకు న్యాయం జరగలేదు

 

యాదాద్రి భువనగిరి ఆగస్టు 2, (globelmedianews.com)
భువనగిరి పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మీడియా సమావేశం నిర్వహించారు.  నయీమ్ కేసులో బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. నయీమ్ కేసులో సమాచార హక్కు చట్టం ద్వారా బయటికి వచ్చిన అధికార పార్టీ నాయకుల , అధికారుల పేర్ల పై చర్యలు తీసుకోవాలి. వెంటనే దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ని కోరుతున్నానని అయన అన్ననారు. మూసి నది కలుషితమమై...ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 110కిలోమీటర్లు, రంగారెడ్డి లో 35 కిలోమీటర్ల వ్యాపించి ఉంది. అంబర్ పేట, ఉప్పల్ లో  ట్రీట్ మెంట్ ప్లాంట్లు కట్టాలి.  మూసి ప్రక్షాళనకు 800 కోట్లు మేము కేటాయించాము. మూసిలో విష రసాయనాలుకలిసి తాగునీరు, ప్రజల ఆరోగ్యం కు నష్టాలు కలిగిస్తుంది. 
నయీం బాధితులకు న్యాయం జరగలేదు

మిషన్ భగీరథ, కాకతీయ ద్వారా మంచి నీరు ఇంకా అందించలేదు. ముఖ్యంగా చౌటుప్పల్ లోని పరిశ్రమలోని  కాలుష్యం మూసి లో కలుస్తుందని అయన అన్నారు. ఈ ప్రాంతాల్లో బునాది గాని కాల్వ 25 సంవత్సరాలు అయినా పూర్తి కాలేదు. నీరు పారలేదు. మిషన్ భగీరథ చేతల్లో లేదన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కేవలం 25 శాతం చెరువులు మాత్రమే నిండాయని అన్నారు. ముఖ్యమంత్రి మాటల గారడి తో పరిపాలన సాగిస్తున్నారు.ఎన్నికలు అయిపోయిన తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేక ప్రారంభమైంది. ఎయిమ్స్ విషయంలో నేను అటల్ బిహారీ వాజ్ పాయి తో మాట్లాడి తీసుకువచ్చాము. మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఎయిమ్స్ ఇచ్చాము. ఇప్పటికే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ న్ ను కలిసి ఎయిమ్స్ ను త్వరగా పూర్తి చేయాలని కొరతానన్నారు. ఎయిమ్స్ లో 20 స్పెషలిటీఎస్ రాబోతున్నాయి. పేదలకు మంచి వైద్యం ఆందబోతుంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరుతున్నాను. ఎయిమ్స్ రాక తో భువనగిరి, బీబీనగర్ పెద్ద పట్టణాలు కాబోతున్నాయి. అభివృద్ధి జరగనుంది.  ఎయిమ్స్ విషయంలోబూర నర్సయ్య గౌడ్ కృషి ని అభినందిస్తున్నాను. భువనగిరి ని తప్పకుండా పర్యాటక కేంద్రం గా అభివృద్ది చేస్తం. తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

No comments:
Write comments