ఏపీ గవర్నర్ జన్మదిన వేడుకలు

 

అమరావతి ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా రాజ్ భవన్   లో తన 85వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరిగే ఈ వేడుకలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.  రాజ్ భవన్   లో   ఉదయాన్నే ఆయనకు తిరుమల తిరుపతి, కనకదుర్గమ్మ దేవస్థానాల వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. 
 ఏపీ గవర్నర్ జన్మదిన వేడుకలు
అనంతరం కేక్ కట్ చేసి, చిన్నారులందరికీ నూతన వస్ర్తాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసారు. సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు మంత్రి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు రాజ్భవన్కు వచ్చి గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఆంధ్రా లయోలా కళాశాలలో అయన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు.

No comments:
Write comments