పాత చలనాలు కట్టుకుని నిబంధనలు పాటించాలి

 

హైదరాబాద్‌ ఆగష్టు 27  (globelmedianews.com)
వాహనదారులకు విజ్ఞప్తి...! మీ వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలానాలు 31-08-2019 లోపు చెల్లించండి. లేనిచో 01-09-2019 నుంచి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయిన వెంటనే పాత జరిమానాలు అన్ని అటోమెటిక్‌గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడును. అంటూ సోషల్‌ మీడియాలో రూమర్‌ చెక్కర్లు కొడుతోంది. 
పాత చలనాలు కట్టుకుని నిబంధనలు పాటించాలి

దీంతో పెండింగ్‌ చలనాలు ఉన్న వాహనదారులు హైరానా పడిపోతున్నారు. దీనిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌లు ట్విట్టర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పడిన చలానాలకు మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. పాత జరిమానా అదే విధంగా ఉంటుందని తెలిపారు. పాత చలనాలు కూడా కట్టుకుని నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

No comments:
Write comments