గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో నిరుద్యోగులకు మనోధైర్యం

 

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, ఆగష్టు 17 (globelmedianews.com)
గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో నిరుద్యోగులకు మనోధైర్యం చేకూరిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జి పి ఆర్ కళ్యాణమండపం లో శనివారం జరిగిన నెల్లూరు రూరల్ గ్రామ, విలీన గ్రామాల ఆత్మీయ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం గ్రామ వాలంటీర్ల తో నేతల పరిచయం అని తెలిపారు. జగన్ పాదయాత్ర లో చెప్పినవన్నీ అమలు చేయడం మొదలు పెట్టారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అందులో 1700 మంది గ్రామ వాలంటీర్లు అని తెలిపారు .ఉద్యోగాలు వస్తాయా అని నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. 
గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో నిరుద్యోగులకు మనోధైర్యం

గ్రామాన్ని బట్టి 10 నుంచి 40 మందికి ఉద్యోగాలు వచ్చాయని, అందువల్ల నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు. దీనికి గాను సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు అవినీతికి తావులేని ప్రజా పాలనతో రాష్ట్రాన్ని సమగ్రంగా ముందుకు తీసుకు వెళ్లడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. పేర్కొన్నారు ప్రస్తుతం గ్రామాల్లో యువతకు గౌరవంగా బ్రతికే అవకాశాన్ని జగన్మోహన్రెడ్డి కల్పించారని, దేశంలో ఇటువంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు. యాభై ఇళ్లకు సేవ చేయడంతోపాటు వారి అభిమానాన్ని కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు. గతంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ మాటలకే పరిమితమైందని, దాన్ని కార్యాచరణలోకి తెచ్చింది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. వాలంటీర్లు చక్కగా పనిచేసి ప్రజలకు నిష్పక్షపాతంగా లబ్ధి చేకూర్చాలని కోరారు. తద్వారా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి , నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రూప్ కుమార్ యాదవ్, సుధాకర్ రెడ్డి ,కోటిరెడ్డి, ఆర్ ఎస్ ఆర్ ,రాజేష్ ,స్వర్ణ వెంకయ్య ,పాముల హరి, నరసింహారావు, ఝాన్సీలక్ష్మి, డాక్టర్ సునీల్ ,తాటి వెంకటేశ్వర్లు, అవినాష్ ,నవీన్ కుమార్ రెడ్డి ,నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గ్రామ వాలంటీర్ల తో ముచ్చటించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

No comments:
Write comments