నంద్యాల లో నీటి సమస్య తీరే దెప్పుడు

 

నంద్యాల ఆగస్టు 19 (globelmedianews.com)
నంద్యాల యందు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎండల కాలంలో చెరువులో తక్కువ నీరు వున్న  రోజుల్లో రెండు రోజుల కొకసారి నీరు తప్ప కుండా  కాలనీ లకు వదులు తుండే వారు . ఎండ కాలం పోయి రెండు మాసములు అయింది వానకాలం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా నంద్యాల లో నీటి  సమస్య తీరడం లేదు . డ్యాంమ్ లు చెరువులు నీటితో పూర్తిగా నిండి పోయినాయి. నీటి కి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయి . కానీ నంద్యాల లో నీటి సమస్య తీరడం లేదు. 
నంద్యాల లో నీటి సమస్య తీరే దెప్పుడు

ఒక్కొక్క కాలనీలో రెండు మూడు రోజుల కొకసారి అయినా  నీరు సరఫరా కావడం  లేదు . ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ లో .ప్రజా ప్రతినిధులు కాలం తీరి పోవటంతో. అధికారుల నిర్లక్ష్యం ఎక్కువ అయిందని పలువురు విమర్శిస్తున్నారు. చెరువులో నిండు కుండల్లా నీరు వున్నా . అధికారుల నిర్లక్ష్యం తో  నంద్యాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు అని పలువురు విమర్శిస్తున్నారు . శాసనసభ్యుడు శిల్ప రవిచంద్రకిశోర్ రెడ్డి వెంటనే నీటి సమస్య ను పరిష్కరించాలని పలువురు పట్టణ ప్రజలు. ప్రముఖులు కోరుతున్నారు.

No comments:
Write comments