పారిశుద్ధ్యంపై అలసత్వం వద్దు జగిత్యాల జాయింట్ కలెక్టర్ బి. రాజేశం

 

జగిత్యాల  ఆగస్టు 01) (globelmedianews.com -Swamy Naidu)
పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత పురపాలక అధికారులపై ఉందని జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రాజేశం అన్నారు .గురువారం కోరుట్ల పట్టణంలో  మున్సిపల్ కమిషనర్ బి .ప్రభాకర్ రెడ్డి లతో జేసి కలసి పట్టణంలోని ఈద్గాను సందర్శించారు.బిలాల్ పుర నుండి ఏసుకుని గుట్ట వెళ్ళే రహదారి,ఈద్గాలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు .

పారిశుద్ధ్యంపై అలసత్వం వద్దు 

జగిత్యాల జాయింట్ కలెక్టర్ బి. రాజేశం 
పాత ఇండ్లను కూల్చిన మట్టిని రోడ్లపై మట్టి కుప్ప లుగా వేయరాదన్నారు. ఆనంతరం హోటల్స్ లో తనిఖీ నిర్వహించి  ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని హోటల్యజమానులకు సూచించారు. హాస్పిటల్స్ లో ఉండే చెత్త మూడు డబ్బాలుగా విభజించాలని తెలిపారు.   ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం దృష్టి పట్టణ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్య బారిన పడకుండా అవకాశముందన్నారు .ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని వార్డు ప్రజలకు సూచించారు. ప్రధానంగా మొక్కల కుండీలు, కాలి టైర్లు కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని తెలిపారు. త్రాగు నీటిని కాచి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. ప్రభాకర్ రెడ్డి , డిప్యూటీ తహసీల్దార్ వకీల్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments