పవన్ సినిమా వైపు అడుగులు

 

హైద్రాబాద్, ఆగస్టు 10, (globelmedianews.com - Swamy Naidu)
ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. పైగా అభిమానులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒక్క సినిమా స‌ర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ త‌ర్వాత మీ యిష్టం అంటూ అడుగుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు పవన్ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత‌మైన కెరీర్ ఫ్లాప్ సినిమాతో ముగిసిపోకూడ‌ద‌ని వాళ్ల భ‌యం. అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ సినిమాతో ముగించే కంటే కూడా ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేసి ఆగిపోండి అంటూ అడుగుతున్నారు. 
 పవన్ సినిమా వైపు అడుగులు
అయితే దీనిపై ప‌వ‌న్ మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. త‌న దృష్టి మొత్తం ఇప్పుడు జ‌న‌సేన‌పైనే ఉందంటున్నాడు.రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టాడు. ఇదే సమయంలో మరో వార్త కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తన కోసం కథలు సిద్ధం చేయాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలకు కబురు పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. అందులో మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు ఏఎం రత్నం లాంటి నిర్మాతలు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనే వీళ్ళతో సినిమాలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు పవర్ స్టార్. కానీ రాజకీయాలతో బిజీగా ఉండి అవి పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చబోతున్నట్లు తెలుస్తుంది.

No comments:
Write comments