కళాశాల ఎదుట

 

ఎస్ఎఫ్ఐ ఆందోళన.
జగిత్యాల, ఆగస్టు 10, (globelmedianews.com)
జగిత్యాల పట్టణంలోని శాంతి జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు విద్యార్థిని చితకబాదిన అధ్యాపకుడి సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా ఘటనపై పై విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శనివారం అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
కళాశాల ఎదుట 

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మనోజ్ అనే విద్యార్థి పై దాడి చేసిన తీరు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైoదన్నారు. అధ్యాపకుడు సిద్దిరాజు పిడిగుద్దులు గుద్దడాని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థిపై దాడి చేసిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు జగిత్యాల టౌన్ ఎస్ఐ అల్తాఫ్ ఖాన్ ను కలిసి అధ్యాపకుడు సిద్ది రాజుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments:
Write comments