జీహెచ్ఎంసీ స్వచ్చ్ సర్వేక్షన్ భేటీ

 

సికింద్రాబాద్ ఆగ‌స్టు 22  (globelmedianews.com)  
సికింద్రాబాద్ హరిహర కళాభావనంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్,  కమిషనర్ దాన కిషోర్ ల ఆధ్వర్యంలో స్వచ్చ్ సర్వేక్షన్ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో హైద్రాబాదు జోనల్ కమిషనర్లు,డిప్యూటీ కమిషనర్లతో పాటు జి.హెచ్.ఎం.సి పరిధిలోని అన్ని విభాగాల అధికారులు,  హాజరయ్యారు.. ఈ సమావేశంలో హరితహారం మొక్కల నాటడం, పన్నుల వసూళ్లు, రోడ్ల మరమ్మత్తులు, కాలువల క్రమబద్దీకరణ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. 
 జీహెచ్ఎంసీ స్వచ్చ్ సర్వేక్షన్ భేటీ

అధికారుల నుండి పలు సూచనలు సలహాలు స్వీకరించారు.  హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీకి, పన్నుల వసూళ్లు,రోడ్ల మరమ్మతుల పనుల లక్ష్యాలు, కాలపరిమితిని నిర్దేశించారు. అంతే కాకుండా ప్రతి శుక్రవారాన్ని హరితహారం రోజుగా పాటించాలని మేయర్  తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఏ విషయంలో నైన ముఖ్యమంత్రి కె సి ఆర్ సడలింపు లిస్తారు... కానీ హరితహారం విషయంలో మాత్రం అందరూ పాల్గొనాలి లక్ష్యాలను అందుకోవాలి ఎవరికి సడలింపులు ఇవ్వరు అని తెలిపారు. అదే విధంగా అన్ని పనులకు ముడిపడి ఉండేది డబ్బు కాబట్టి ఆస్తి పన్నులు వసూళ్ల లక్ష్యాలను సాధించాలని కోరారు.

No comments:
Write comments