మళ్లీ ప్రారంభమైన ఇసుక దోపిడీలు

 

తుగ్గలి ఆగస్టు 9 (globelmedianews.com - Swamy Naidu):
కర్నూలు జిల్లా  తుగ్గలి మండల పరిధిలోని మారేళ్ళ గ్రామ సమీపాన,బొందిమడుగుల రెవిన్యూ పరిధిలో ట్రాక్టర్ యజమానులు మరలా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.గతంలో కూడా యంత్రాల సహాయంతో బొందిమడుగుల చెరువులో ఇసుకను బయటకు తీసి తరలించేవారు,అయితే పూర్వపు తహశీల్దార్ రామకృష్ణ ట్రాక్టర్ యజమానులని పిలిచి హెచ్చరించడంతో కొన్ని రోజులు మానుకొని తరువాత ఎలెక్షన్ కోడ్ రావడంతో ఎలెక్షన్ డ్యూటీ మీద రామకృష్ణను బదిలీ చేయడంతో, మరలా ఇసుక రవాణా మొదలైంది.ఈ సారి భారీగా దాదాపు 15-20 అడుగులు లోతు తవ్వి ఇసుకను బయటకు తీసి తరలించడం మొదలైంది.ప్రస్తుతం వచ్చిన తహశీల్దార్ జాకీర్ హుస్సేన్ కు పిర్యాదు అందడంతో సంబంధిత విఆర్వో వెంకట్రాముడును పిలిచి మందలించారు.
మళ్లీ ప్రారంభమైన ఇసుక దోపిడీలు
ఆయన వెంటనే ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిచి ఎస్సై రమేష్ బాబు ట్రాక్టర్ యజమానులను హెచ్చరించారు.అయితే ఈ హెచ్చరికలు కొన్ని రోజులే తరువాత మాములే గతంలో పత్రికలలో కూడా వార్తలు వచ్చిన అధికారులు వాటికి స్పందించక పోవడం పట్ల అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఇసుక రవణాతో చెరువు రూపురేఖలు మారిపోయాయి.అధికారులు కూడా వీరిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.వీటిని అలుసుగా తీసుకొని ట్రాక్టర్ యజమానులు మరలా ఇసుక రవాణా మొదలు పెట్టారు.కొన్ని రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు  తనిఖీలు చేసినప్పటికీ ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి.ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆర్.ఐ సుదర్శన్,వి.ఆర్.ఓ లు వెంకట్రాముడు,కాశీ రంగస్వామి,వాసుదేవయ్య మరియు వి.ఆర్.ఏ వెళ్లి ఇసుకను త్రవ్వే ప్రదేశాన్ని పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తరలించడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని అందువల్ల త్రాగునీటి కష్టాలు అధికామవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.ఈ సందర్భంగా ఆర్.ఐ సుదర్శన్ గ్రామంలో దండోరా వేయించి,ఇక పై ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments:
Write comments