ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు

 

హైద్రాబాద్, ఆగస్టు 6, (globelmedianews.com - Swamy Naidu)
వరుసగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద వల్ల ప్రాజెక్టుల్లోకి మెల్లమెల్లగా నీరు చేరుతోంది. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కర్నాటక ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తారు. దిగువ ప్రాంతమైన శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.77ల నీటి సామర్థ్యం ఉంది. నెట్టెంపాడుకు 2250 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630క్యూసెక్కులు, బీమా-1కు 1300 కూసెక్యులు, బీమా-2కు 750 క్యూసెక్కుల నీటిని తోడి పోస్తున్నారు. జూరాల కుడి కాల్వకు 725 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 750 క్యూసెక్కులు, రామన్‌పాడు కాల్వకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
 ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు
నారాయణపూర్‌ డ్యాం నుంచి జూరాలకు 2లక్షల 62వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.భద్రాచలం వద్ద గోదావరికి మంగళవారం ఉదయం నుంచి తర్వాత మళ్లీ వరద పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు 42.1 అడుగులకు, మధ్యాహ్నం ఒంటిగంటకు 42.5 అడుగులకు, సాయంత్రం 4 గంటలకు 42.9 అడుగులకు పెరిగింది. రాత్రి 7 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారుల అంచనా ప్రకారం మంగళవారానికి రెండో ప్రమాద హెచ్చరిక వరకు ప్రవాహం పెరగనుంది.పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుంటోంది. 15రోజుల కిందట 5టీఎంసీల లోపు నీరు ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం 19టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం20.175టీఎంసీలు కాగా, 19.7 టీఎంసీలకు చేరుకుంది. నీటిమట్టం పెరగడంతో సోమవారం 10గేట్లు ఎత్తారు. అందులో7 గేట్లు 0.5 మీటర్ల ఎత్తుకు, మరో మూడు గేట్లు మీటర్‌ ఎత్తుకు ఎత్తి 35వేల 953 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కూడా ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా, సోమవారం నాటికి 1053.20 అడుగుల(7.99 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.సిటీలో ఇక రోడ్లు రిపేర్లుహైదరాబాద్ లో ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం దెబ్బకు జనజీవనం ఇబ్బందులు పడుతుంది. భారీ వర్షాల కారణంగా నగరంలో రోడ్లపై చాలావరకు గుంతలు పడ్డాయి. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ టీమ్ నగర రోడ్లను పరిశీలించింది.ఈ క్రమంలో 4వేల  గుంతలు, 987 చోట్ల కొంత దూరం వరకు రోడ్లు అధ్వానంగా తయారైనట్లు గుర్తించింది. వీటిని వెంటనే బాగు చేసేందుకు రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది టీమ్. ఈ గుంతలను పూడ్చడంతోపాటు దెబ్బతిన్న మార్గాలను వెంటనే ఉపయోగించడానికి రూ.50 కోట్లు విడుదల చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.గుంత పరిమాణం బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు గుంతను పూడ్చేందుకు ఖర్చు అవుతుంది. ప్యాచ్‌ వర్క్‌ అయితే దూరం బట్టి రూ. 5000 నుంచి రూ.15, 20 వేల వరకు ఖర్చు పెట్టేఅవకాశంఉంది.రామంతాపూర్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, నారాయణగూడ,హిమాయత్‌నగర్‌,హైదర్‌గౌడ,మెహిదీపట్నం, తార్నాక, మల్కాజ్‌గిరి, సైనిక్‌పురి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గతంలో గుంతలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు అధికారువారం రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల నగరంలో పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల 4000లకు పైగా గుంతలు ఏర్పడినట్లు ఆయన పేర్కొంటూ, గుంతల పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. వర్షం ఆగిపోతే బుధవారం నుంచి గుంతల పూడ్చివేత పూర్తవుతుందని ఆయన తెలిపారు.  జీహెచ్‌ఎంసీకి చెందిన మాన్సూన్ యాక్షన్ టీమ్‌ల ఆధ్వర్యంలో రోడ్ల గుంతల పూడ్చివేత కొనసాగుతున్నట్లు చెప్పారు. అలాగే, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం స్వల్పకాల టెండర్లు పిలిచి గురువారం నుంచి పనులు చేపట్టనున్నారు. 

No comments:
Write comments