ఐటీ కారిడార్ లో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు

 

హైద్రాబాద్, ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చటానికి  పోలీసులు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో వాహాన దారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పటంలేదు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పెరగుతున్నట్రాఫిక్ జామ్ లకు జంక్షన్లు లేకపోవడమే ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. చాలా ప్రాంతాల్లో రహదారులకు కిలోమీటర్ల మేర వెళ్లినా జంక్షన్లు లోకపోవటంతో వాహనదారులు రోడ్డుపై ఏర్పాటు చేసిన మీడియన్లు తొలగించి వెళ్ళటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఇందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియం నుంచి గుల్ మొహర్ పార్క్ వరకు రెండు ట్రాఫిక్ జంక్షన్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు పోలీసుశాఖకు లేఖ రాశారు.
 ఐటీ కారిడార్ లో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు
లింగంపల్లి నుంచి గచ్చిబౌలి మార్గంలో వాహనదారులు ఎక్కువగా మీడియన్లు ఉపయోగించటంతో గంటలకొద్దీ ట్రాఫిక్ జాం అవుతోందని తెలిపారు. దీనికి ట్రాఫిక్ జంక్షన్లు ఏర్పాటుచేయటమే శాశ్వత పరిష్కారమని ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్ తెలిపారు.ఐటీ కారిడార్ లో వందలాది ఐటీ కంపెనీలు వుండటం, వాటికి రోజూ వచ్చిపోయే లక్షలాది మంది ఉద్యోగుల వాహనాలు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా వేశారు. ఇవికాక స్కూల్, కాలేజీ బస్సులు, ఇతర వ్యాపారాల కోసం, నిర్మాణరంగం కోసం సామాగ్రి తీసుకువచ్చే వాహానాలు.. మరో రెండు లక్షల వరకు ఉంటాయి. ఈ రకంగా ఐటీ కారిడార్ లో  పెరుగుతున్న వాహానాలతో తరచూ తీవ్ర ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఇతర ప్రాంతాలు కూకట్ పల్లి, నిజాంపేట, లింగంపల్లి, శంకర్ పల్లి వివిధ ప్రాంతాల్లో ఉంటూ రాకపోకలు సాగిస్తూ ఉండటం కూడా ట్రాఫిక్ జాం కు మరో కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కేపీహెచ్ బీ నుంచి హైటెక్స్ మార్గంలో ఆర్వోబీ, నల్లగండ్ల ఆర్వోబీ, మియాపూర్ మార్గంలో ఆర్వోబీ,  ఈ 3 మాత్రమే ఉండటంతో వాహనాల రద్దీని నియంత్రించటం కూడా కష్టం అవుతోందని పోలీసులు చెపుతున్నారు. ఖత్లపూర్, హిందూ ఫార్చూన్ వద్ద రెండు ఆర్వోబీలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జాం నుంచి వాహనదారులకు విముక్తి కలుగుతుందంటున్నారు.

No comments:
Write comments