శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం

 

వనపర్తి  ఆగష్టు 13 (globelmedianews.com - Swamy Naidu
ప్రతి ఒక్కరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో లోకకల్యాణార్థం గోపాల్ పేట లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో గురువారం శ్రీ సత్యనారాయణ వ్రతం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రంగాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతం
శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది గురువారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా లోకరక్షకుడైన శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు, ప్రజలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా శ్రీ సత్యనారాయణ వ్రత పూజలో పాల్గొని స్వామి వారి కథను విని తరించి ప్రతి ఒక్కరు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు పొందుతూ స్వామి వారి దీవెనలు తీసుకోవాలని ఆయన కోరారు.

No comments:
Write comments