తెలంగాణలో నపుంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీ,టీఆర్ఎస్

 

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
హైదరాబాద్ ఆగష్టు 17 (globelmedianews.com):
తెలంగాణలో బీజేపీ,టీఆర్ఎస్ నపుంసక రాజకీయాలు చేస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు.శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేటీఆర్ బీజేపీపైన..లక్ష్మణ్ టీఆర్ఎస్ పైన చేస్తున్న విమర్శలు దీనికి అడ్డంపడుతున్నాయన్నారు.కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీకి కేంద్రంలో బేషరటు మద్దతు ఇస్తున్నది నిజం కాదాఅని ప్రశ్నించారు.టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా రాష్ట్ర సమస్యలపై బీజేపీ సర్కార్ ను నిలదీశారా అన్నారు.బీజేపీ కబంధ హస్తాలలో టీఆర్ఎస్ ఎంపీలు బందీ అయ్యారని పేర్కొన్నారు.
తెలంగాణలో నపుంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీ,టీఆర్ఎస్ 

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని ఇన్ని ఏళ్ళ తరువాత లక్ష్మణ్ కు గుర్తుకొచ్చిందా..అని సంపత్క్ కుమార్ ప్రశ్నించారు.గత ఐదేళ్లలో లక్షన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ అరాచకాలు ఎందుకు కనపడలేదని అన్నారు.లక్ష్మణ్ వి నపుంసక రాజకీయాలు కాదు అంటే .. కేసీఆర్ అవినీతిపై కేంద్ర సర్కార్ స్పందింపజేయాలని డిమాండ్ చేసారు.కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసు .. నయీమ్ కేసు .. కాళేశ్వరం అవినీతి .. ఇంటర్ అవకతవకలపై కేంద్ర సర్కార్ ఎందుకు స్పందించడం లేదో లక్ష్మణ్ చెప్పాలన్నారు.లక్ష్మణ్ ఇంకో సారి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే ఆ తడాఖా చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు.లక్ష్మణ్ ..ముందు నీ అధ్యక్ష పదవి ఉడకుండా కాపాడుకో ..మని సంపత్ సూచించారు.ఎంపీ పదవి కోసం బీజేపీ కి అమ్ముడు పోయిన డీకే అరుణ లక్ష్మణ్ పదవికి ఎసరు పెడుతోంది..  అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్ ను వీడిన ఉడతలుపట్టే నాయకులతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు.

No comments:
Write comments