వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారు

 

గుంటూరు ఆగస్టు 8, (globelmedianews.com - Swamy Naidu)
రాష్ట్రంలో అందరూ శాంతిని కోరుకుటున్నారు. వైసిపి కి చెందిన వారు దాడులకు పాల్పడుతున్నారు. వైసిపి దాడులను ఖండిస్తూ టిడిపి నాయకులను రేపు పల్నాడు ప్రాతానికి పంపనున్నాని టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారు
చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లా భీమవరానికి చెందిన శ్రీహరి కుటుంబానికి నిలులు నీడ లేకుండా చేశారు. పార్టీ తరుపున శ్రీహరి కుటుంబానికి యాభైవేల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందిస్తామని అన్నారు.  రాష్ట్రంలో అతి పెద్ద కంపేనీ కియా కారు రోడ్డు పైకి వస్తోంది. కియా కారు రోడ్డు పైకి రావడం సంతోషంగా ఉంది. ఆటో మోబైల్ కంపేనీలలో కియా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అయన అన్నారు. ఎంతోమందికి కియా మోటారు ఉపాదిని ఇస్తోంది. కియా కోసం తీవ్ర ప్రయత్నాలు చేశామని అయన గుర్తు చేసారు

No comments:
Write comments