. టీడీపీని డిఫెన్స్ లో పడేస్తున్న జగన్

 

గుంటూరు, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఒక్క అంశంలో పదేపదే నొక్కినొక్కి చెప్పింది. సారవంతమైన మూడు పంటలు పండే భూములను నగరంగా మార్చి పర్యావరణ హానీ చేయకండని చెప్పుకొచ్చింది. అయినా కానీ ఆ కమిటీ వద్దని చెప్పిన చోటే తెలుగుదేశం సర్కార్ నాడు రాజధానిని తెచ్చి పెట్టింది. దానికి అమరావతి అని అందమైన నామకరణం, ల్యాండ్ పూలింగ్ అంటూ మరో ట్యాగ్ లైన్ పెట్టి అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రచారం తో దంచిపడేసి బ్రాండ్ క్రియేట్ చేసేసింది. ఇక ముఖ్యమైన అసెంబ్లీ, సచివాలయాలవంటివి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి అమరావతి అందమైన కలగా మార్చేసింది. ఈలోపు సర్కార్ మారింది ప్రాధాన్యతలు మారిపోయాయి. వైసిపి సర్కార్ వచ్చి రావడంతోనే రాజధాని పేరుతో సాగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. దీనిపై కమిటీ వేసి చిట్టా విప్పే పనిలో బిజీ అయిపొయింది.అమరావతి ని రాజధానిగా ప్రకటించే ముందు తెలుగుదేశం ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడింది అన్నది ప్రధానంగా వైసిపి అనుమానం.
టీడీపీని డిఫెన్స్ లో పడేస్తున్న జగన్ 
దానికి తగినవిధంగానే టిడిపి సర్కార్ చర్యలు సాగాయి. పసుపు పార్టీలోని బడా నేతలనుంచి చోటా నేతలవరకు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలను అక్కడ కొనుగోలు చేసి పారేశారన్నది వైసిపి ఆరోపిస్తూ వస్తుంది. అది నిజమే అని నిరూపించుకునే పనిలో జగన్ సర్కార్ ఒక లీక్ పసుపు కోటను డిఫెన్స్ లో పడేసింది. సినీనటుడు, హిందూపురం ఎమ్యెల్యే, చంద్రబాబు బావమరిది వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఆయన బంధువుల పేరిట 500 ల ఎకరాలకు పైగా కొనుగోలు చేశారన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలే సృష్ట్టించాయి. ఇక మంత్రులు, ఎంపిలు, ఎమ్యెల్యేలు చాలామంది ఈ వరుసలో ఉన్నారని వైసిపి ఆరోపిస్తుంది.బాలకృష్ణ బంధువుల పేర్లతో బినామీ ఆస్తులు కొనుగోలు చేశారన్న అంశం చిన్నది కాదు. నందమూరి రామారావు నట, రాజకీయ వారసుడిగా వున్న బాలకృష్ణ లోకేష్ కి స్వయంగా పిల్లనిచ్చిన మామ కావడంతో ఆయన సీన్ లోకి దిగారు. బాలకృష్ణ పై ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని అంటున్నారు లోకేష్. వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందని బాబు తనయుడు చెలరేగుతున్నారు. బాలకృష్ణ బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారన్న అంశం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా వున్న వ్యక్తే బయటపెట్టారని అంటున్నారు. దాంతో లోతుగా దర్యాప్తు జరిపితే ఆధారాలన్నీ బయటకు వస్తాయన్నది వైసిపి నమ్మకం. లోకేష్ సవాల్ ను నిరూపించాలని తమ పార్టీ ఎప్పటినుంచో రాజధానిపై చేస్తున్న ఆరోపణలు సత్యం గా చాటిచెప్పాలన్న సంకల్పంతో రంధ్రాన్వేషణ మరింత తీవ్రంగా చేస్తుంది. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాక సరైన సమయంలో బయటపెట్టాలన్న పనిలో అధికారపార్టీ బిజీ అయిపొయింది. బినామీల పేర్లతో నడిచే ఇలాంటి వ్యవహారాలు అంత ఈజీగా బయటపడవు. కానీ వైసిపి ప్రభుత్వం ఎలాగైనా నిరూపించాలని సాగిస్తున్న ఆరోపణలు విమర్శల సమరంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

No comments:
Write comments