గుంటూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం

 

గుంటూరు, ఆగస్టు 10 (globelmedianews.com - Swamy Naidu)
గుంటూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు.. గుప్తనిధుల కోసం 300 ఏళ్లనాటి ప్రాచీన ఆలయంలో తవ్వకాలు జరిపారు. అచ్చంపేట మండలం వేల్పూరులోని శివాలయంలో ఈ తవ్వకాలు జరిగాయి. రాయల కాలం నాటి ఈ ఆలయంలో గుప్తనిధులు లభిస్తాయనే ఉద్దేశంతోనే దుండగులు తవ్వకాలు జరిపారని భావిస్తున్నార ఆలయంలోకి వచ్చిన పుజారికి నంది విగ్రహం ధ్వంసమైన స్థితిలో కనిపించింది. ఓ స్థంభాన్ని కూడా దుండగులు కూల్చేశారు. 
 గుంటూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం
గతంలోనూ ఈ ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో భారీగా బంగారు నిధులు ఉన్నాయని బలంగా నమ్మిన కొందరు.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. దుండగులపై కేసు నమోదు చేశారు. రెండున్నరేళ్ల క్రితం ఇదే జిల్లాలోని దాచేపల్లి మండలం అలుగుమల్లెపాడు శివాలయంలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. శివలింగాన్ని తవ్వి ఆ ప్రదేశంలో పసుపు, కారం చల్లి పరారయ్యారు

No comments:
Write comments