పచ్చని పొలాలపై కాలుష్య పగ

 

ఖమ్మం, ఆగస్టు 28, (globelmedianews.com - Swamy Naidu
ఖమ్మం జిల్లాలోని సారపాక నుంచి రామవరం జాతీయ రహదారి నిర్మాణం పక్కన ఉండే పొలాలకు శాపంలా మారింది ఈ నిర్మాణ పనుల్ని  కాంట్రాక్టర్  నిర్లక్ష్యం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన మెటల్‌, డాంబర్‌ వినియోగానికి మండలంలోని సీతానగర్‌కాలనీ సమీపంలో హార్డ్‌ మిక్సింగ్‌, వేస్ట్‌ మిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనికోసం ఓ రైతు పొలం లీజుకు తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ ప్లాంట్ల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల సమీప పంట పొలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్లాంట్‌ నుంచి వెలువడే బూడిద పంటలపై పడి దిగుబడి రావట్లేదు. విసుగు చెందిన రైతులు యాజమాన్యంతో  పోరాడితే పొలం దూరాన్ని బట్టి ఏటా నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 
 పచ్చని పొలాలపై  కాలుష్య పగ 
తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఈ ఒప్పందాన్ని అంగీకరించారు. గత రెండేళ్లు ఎకరానికి రూ.6-8 వేల వరకు నష్ట పరిహారం చెల్లించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలవుతున్నా.. ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. అడిగి అడిగి విసిగిన రైతులు ఆందోళనబాట పట్టారు.మూడేళ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ ఇంకా 50శాతం పనులు పూర్తికాలేదు. ఇదేమంటే పట్టణ ప్రాంతాల్లో పైపులైన్లు, విద్యుత్తు స్తంభాలు, చెట్లు తొలగించడానికి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రాకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వరకు వాహనాలు వెళ్లేందుకు ఓ రోడ్డయితే వేశారు.  మిగిలిన పనులు డివైడర్స్‌, డ్రైన్స్‌ పనులు చాలా వరకు పూర్తి కాలేదు.ప్లాంట్లు ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో పత్తి, వరి, మిరప పంటలను రైతులు పండిస్తూ లాభాలు గడించారు. ఎకరాలకు రూ.15-20 వేలు ఆదాయం పొందారు. ప్రస్తుతం బూడిద వల్ల పక్కనున్న పొలాల్లోకి మేటలు వేయడంతో పంటలు పడించుకోలేని దుస్థితి. పరిసర ప్రాంతాల్లోని సుమారు 50 ఎకరాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క ఏడాదే ప్లాంట్లు నడుపుతామని నమ్మబలికి పొలాలు తీసుకున్నారని మూడేళ్లయినా నిర్మాణం పూర్తికాక పంటల్ని నష్టపోవాల్సి వస్తుందని కర్షకులు వాపోతున్నారు. ఇటీవల వచ్చిన వర్షాలకు ప్లాంట్‌ బూడిద పొలాల్లోకి చేరి బూడిద చెరువులా మారాయన్నారు. ఎవరైనా పొలంలోకి వెళ్లినా దిగబడి పోతున్నారన్నారు.  భవిష్యత్తులో ఈ పొలాలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు, గుత్తేదారు స్పందించి నష్టపరిహారం పెంచాలని బాధితులు కోరుతున్నారు.

No comments:
Write comments